కరోనా పాజిటివ్ పేషెంటుని ఎప్పుడు డిశ్చార్జి చేస్తారు?

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సోకిందని గుర్తించడానికి సలైవా టెస్టు, ప్లాస్మా టెస్టు, యాంటీ బాడీ టెస్టు ఉన్నాయి. మరి కొంతమందిని మాత్రం కరోనా తగ్గింది అంటూ డిశ్చార్జి చేస్తున్నారు. అయితే ఈ డిశ్చార్జి చేయడానికి ఒక ప్రొటోకాల్ ఉంది. ఈ వైరస్ మొదటగా ప్రబలిన చైనాలో నేషనల్ హెల్త్ కమిషన్ వారు ఒక డిశ్చార్జీ ప్రోటోకాల్ సిద్ధం చేశారు. వారి ప్రోటోకాల్ ప్రకారం కరోనా పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తిగా వరుసగా మూడు రోజుల పాటు జ్వరం […]

Update: 2020-04-10 23:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ సోకిందని గుర్తించడానికి సలైవా టెస్టు, ప్లాస్మా టెస్టు, యాంటీ బాడీ టెస్టు ఉన్నాయి. మరి కొంతమందిని మాత్రం కరోనా తగ్గింది అంటూ డిశ్చార్జి చేస్తున్నారు. అయితే ఈ డిశ్చార్జి చేయడానికి ఒక ప్రొటోకాల్ ఉంది. ఈ వైరస్ మొదటగా ప్రబలిన చైనాలో నేషనల్ హెల్త్ కమిషన్ వారు ఒక డిశ్చార్జీ ప్రోటోకాల్ సిద్ధం చేశారు. వారి ప్రోటోకాల్ ప్రకారం కరోనా పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తిగా వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లక్షణాలు కనిపించకూడదు, శ్వాస తీసుకోవడంలో మెరుగుదల ఉండాలి, 24 గంటల వ్యవధిలో రెండు సార్లు వారి న్యూక్లియక్ యాసిడ్ పరీక్షలు నెగెటివ్ రావాలి. అంతేకాకుండా ఒకసారి డిశ్చార్జి అయ్యాక 14 రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాలి, మాస్క్ ధరించాలి, రెండు నుంచి నాలుగు వారాల పాటు డాక్టర్‌ని సంప్రదిస్తుండాలి.

భారతదేశంతో పాటు ప్రపంచంలో చాలా దేశాలు దాదాపుగా ఇదే ప్రొటోకాల్ పాటిస్తున్నారు. మన దేశంలో నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) ప్రకారం అనుమానిత పాజిటివ్ కేసు వారి వైరస్ పరీక్షలు నెగెటివ్‌గా వస్తే సరిపోతుంది. కాకపోతే వారిని 14 రోజుల నిర్బంధ ఐసోలేషన్‌లో ఉండాలి. అంతేకాకుండా కొవిడ్ 19 పేషెంట్ ఛాతీ రేడియోగ్రఫిక్ నెగెటివ్ రావాలి. ఇటలీలో అయితే సార్స్ టెస్ట్ కూడా నెగెటివ్ రావాలి. సింగపూర్‌లో అయితే కనీసం ఆరు రోజుల పాటు ఎలాంటి ఆరోగ్య సమస్య లేకుండా, పీసీఆర్, రెస్పిరేటర్ శాంపిళ్లు నెగెటివ్ రావాలి. అలాగే అమెరికాలో ఆర్ఆర్‌టీ పీసీఆర్, 24 గంటల వ్యవధిలో రెండు సార్లు నాసోపరింగల్, థ్రోట్ స్వాబ్ నమూనా పరీక్షలు నెగెటివ్ రావాలి.

tags: Corona, Discharge, Covid 19, Sars, India, Italy, China

Tags:    

Similar News