కేబినెట్ భేటీలో మళ్లీ నిరుద్యోగులకు నిరాశే!
దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి మండలి భేటీ ముగిసింది. సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను కమిటీ చర్చించింది. ఈ క్రమంలో ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. అయితే ఎన్నో ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగులకు మాత్రం నిరాశే ఎదురైంది. కేబినెట్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్ పై చర్చ వస్తుందని రాష్ట్రంలోని నిరుద్యోగులు భావించారు. కానీ అసలు ఆ ఊసే ఎత్తకపోవడంతో నిరుద్యోగులు ట్విట్టర్ వేదికగా […]
దిశ, డైనమిక్ బ్యూరో : సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రగతి భవన్‌లో జరిగిన మంత్రి మండలి భేటీ ముగిసింది. సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను కమిటీ చర్చించింది. ఈ క్రమంలో ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించింది. అయితే ఎన్నో ఆశలతో ఎదురుచూసిన నిరుద్యోగులకు మాత్రం నిరాశే ఎదురైంది. కేబినెట్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్ పై చర్చ వస్తుందని రాష్ట్రంలోని నిరుద్యోగులు భావించారు. కానీ అసలు ఆ ఊసే ఎత్తకపోవడంతో నిరుద్యోగులు ట్విట్టర్ వేదికగా ఫైర్ అవుతున్నారు. ఇంకెప్పుడు ఉద్యోగాలు ఇస్తారంటూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై విమర్శలు కురిపిస్తున్నారు.