మైనర్ బాలికను పెళ్లి పేరుతో వేధిస్తున్న వికలాంగుడు అరెస్ట్​

దిశ, జల్ పల్లి : కిరాణ షాపులో పనిచేసే మైనర్ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్న వికలాంగుడిపై పహాడీ షరీఫ్ పోలీసులు పొక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. పహాడీ షరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్ పల్లికి చెందిన వికలాంగుడు సుగుణరావు(44) ఓ కిరాణ దుకాణాన్ని నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 15 సంవత్సరాల మైనర్ బాలిక కిరాణ దుకాణంలో పనిచేస్తుంది. దీంతో ఆ మైనర్ బాలిక పై […]

Update: 2021-09-23 12:02 GMT

దిశ, జల్ పల్లి : కిరాణ షాపులో పనిచేసే మైనర్ బాలికను ప్రేమ, పెళ్లి పేరుతో వేధిస్తున్న వికలాంగుడిపై పహాడీ షరీఫ్ పోలీసులు పొక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు. పహాడీ షరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్ పల్లికి చెందిన వికలాంగుడు సుగుణరావు(44) ఓ కిరాణ దుకాణాన్ని నడుపుతున్నాడు. అదే ప్రాంతానికి చెందిన 15 సంవత్సరాల మైనర్ బాలిక కిరాణ దుకాణంలో పనిచేస్తుంది. దీంతో ఆ మైనర్ బాలిక పై కన్నేశాడు. గత ఆరు నెలలుగా సదరు బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు.

తనను పెళ్లి చేసుకోక పోతే నీ క్యారెక్టర్ పై చెడు ప్రచారం చేస్తానంటూ బెదిరించసాగాడు. రోజురోజుకు వేధింపులు అధికమవుతుండడంతో బాలిక జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేసింది. కుటుంబ సభ్యులతో కలిసి మైనర్ బాలిక పహాడీ షరీఫ్ పోలీసులకు బుధవారం రాత్రి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పొక్సో చట్టం కింద కేసును నమోదు చేసుకున్న పహాడీ షరీఫ్ పోలీసులు, సుగుణరావును అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించారు.

Tags:    

Similar News