‘జగన్’ కడుపులో కొకైన్.. కల్పితం నిజమైంది
దిశ, వెబ్‌డెస్క్: ముంబైలో వెలుగుచూసిన ఈ సీన్ చూస్తుంటే హీరో సూర్య డ్రగ్స్ స్మగ్లర్‌గా నటించిన ‘వీడొక్కడే’ సినిమా గుర్తొస్తుంది. అందులో హీరోయిన్ అన్న క్యారెక్టర్ చేసిన కమేడియన్ జగన్ అందరికీ సుపరిచితమే. ఇదే సినిమాలో తాను చేసిన ఓ సీన్ సినిమానే మలుపుతిప్పుతుంది. అది ఏంటంటే.. ఇండియా నుంచి డ్రగ్స్ తరలించేందుకు సర్జికల్ గ్లౌజ్‌లను టాబ్లెట్ ఆకారంలో కట్‌చేసి.. అందులో కొకైన్ నింపి మింగేస్తాడు జగన్. ఆ తర్వాత విదేశానికి తరలించే క్రమంలో ఓ టాబ్లెట్ […]
దిశ, వెబ్‌డెస్క్: ముంబైలో వెలుగుచూసిన ఈ సీన్ చూస్తుంటే హీరో సూర్య డ్రగ్స్ స్మగ్లర్‌గా నటించిన ‘వీడొక్కడే’ సినిమా గుర్తొస్తుంది. అందులో హీరోయిన్ అన్న క్యారెక్టర్ చేసిన కమేడియన్ జగన్ అందరికీ సుపరిచితమే. ఇదే సినిమాలో తాను చేసిన ఓ సీన్ సినిమానే మలుపుతిప్పుతుంది. అది ఏంటంటే.. ఇండియా నుంచి డ్రగ్స్ తరలించేందుకు సర్జికల్ గ్లౌజ్‌లను టాబ్లెట్ ఆకారంలో కట్‌చేసి.. అందులో కొకైన్ నింపి మింగేస్తాడు జగన్. ఆ తర్వాత విదేశానికి తరలించే క్రమంలో ఓ టాబ్లెట్ పంచర్ కావడంతో… కడుపు కోసి మరీ విలన్‌లు కొకైన్‌ను స్వాధీనం చేసుకుంటారు. అతడిని కాపాడే ప్రయత్నంలో హీరో సూర్య విఫలమై అరెస్ట్ అవుతాడు. చివరకు పొట్ట కోసి కొకైన్ తీసిన వీడియో బయటకు వచ్చి.. సినిమా క్లైమాక్స్‌కు చేరుతుంది.
ఇదంతా ఎందుకు గుర్తు చేస్తున్నామంటే.. సేమ్ ఇదే సీన్ ముంబైలో జరిగింది. ఇద్దరు టాంజానియా దేశానికి చెందిన వ్యక్తుల కదలికలపై అనుమానం వచ్చిన డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. వారి వద్ద ఎటువంటి డ్రగ్స్ లభించలేదు. కానీ, కడుపు భాగం కాస్తా ఉబ్బుగా ఉండడంతో ఆపరేషన్ థియేటర్‌కు తరలించి స్కానింగ్ చేయగా.. కొకైన్ నింపిన టాబ్లెట్లు మింగినట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆపరేషన్ చేసి ఇద్దరి కడుపులో నుంచి సుమారు 13.35 కోట్ల విలువగల 2 కిలోల 225 గ్రాముల కొకైన్‌ను రికవరీ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొకైన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. ప్రధాన సూత్రధారులు ఎవరు అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.