కట్టడి వల్ల బ్లాక్ మార్కెట్ పెరగొచ్చు‌: ఆర్జీవీ

భారత్ సహా ప్రపంచాన్ని వణికిస్తోన్న నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌పై స్పందిస్తూ సినీ దర్శకుడు రామ్ ‌గోపాల్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ విధించినప్పటి నుంచీ మద్యం షాపులూ బంద్ చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు కోరుకునే దేనినైనా కఠిన పద్ధతుల్లో కట్టడి చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ వస్తుందనీ, ధరలు పెంచడానికి అవకాశం ఉంటుందనీ, దీంతో తమకు కావాల్సిన ఆల్కహాల్‌ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు […]

Update: 2020-04-26 02:06 GMT

భారత్ సహా ప్రపంచాన్ని వణికిస్తోన్న నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్ 19) వ్యాప్తి కట్టడికి విధించిన లాక్‌డౌన్‌పై స్పందిస్తూ సినీ దర్శకుడు రామ్ ‌గోపాల్‌ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ విధించినప్పటి నుంచీ మద్యం షాపులూ బంద్ చేసిన సంగతి తెలిసిందే. ప్రజలు కోరుకునే దేనినైనా కఠిన పద్ధతుల్లో కట్టడి చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ వస్తుందనీ, ధరలు పెంచడానికి అవకాశం ఉంటుందనీ, దీంతో తమకు కావాల్సిన ఆల్కహాల్‌ను చాలా ఎక్కువ ధరకు కొనుగోలు చేయడానికి మందుబాబులు డబ్బును అధికంగా ఉపయోగిస్తారని తెలిపారు. దీంతో వారి కుటుంబాలు ఇతర అవసరాలను కొనుగోలు చేసే డబ్బును కోల్పోయే అవకాశం ఉందని అన్నారు. ఆల్కహాల్‌ లేకపోవడంతో కొందరిలో పెరిగిపోతోన్న ఫ్రస్టేషన్‌ స్థాయి గురించి నాయకులు ఆలోచించాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.


Tags: covid 19 affect, lockdown, alcohol, bars, closed,tweet, director RGV

Tags:    

Similar News