సొంతూరులో సందడి చేసిన ‘జాతిరత్నాలు’ డైరెక్టర్..

దిశ ప్రతినిధి, మెదక్ : జాతిరత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్ స్వంత జిల్లాలో సందడి చేశారు. అనుదీప్ స్వంత ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు శనివారం విచ్చేశారు. నారాయణఖేడ్ ప్రాంతములోని నాగలిగిద్ద, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనుదీప్ కేవీని నారాయణఖేడ్ ప్రాంత మిత్రులు, జర్నలిస్టులు, అభిమానులు, కళాకారులు సన్మానించారు. అనుదీప్‌కు మిఠాయిలు తినిపిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. మున్ముందు మరెన్నో మంచి సినిమాలు తీసి గొప్ప డైరెక్టర్‌గా స్థిరపడాలని ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో మిత్రులు […]

Update: 2021-08-21 10:17 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : జాతిరత్నాలు మూవీ డైరెక్టర్ అనుదీప్ స్వంత జిల్లాలో సందడి చేశారు. అనుదీప్ స్వంత ప్రాంతమైన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు శనివారం విచ్చేశారు. నారాయణఖేడ్ ప్రాంతములోని నాగలిగిద్ద, తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ అనుదీప్ కేవీని నారాయణఖేడ్ ప్రాంత మిత్రులు, జర్నలిస్టులు, అభిమానులు, కళాకారులు సన్మానించారు.

అనుదీప్‌కు మిఠాయిలు తినిపిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. మున్ముందు మరెన్నో మంచి సినిమాలు తీసి గొప్ప డైరెక్టర్‌గా స్థిరపడాలని ఆకాంక్షించారు. సన్మానించిన వారిలో మిత్రులు గోపీనాథ్ రాథోడ్, ధీరజ్ కుమార్, గోవర్ధన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శివశంకర్, జర్నలిస్టులు పరమేశ్వర్, రవీందర్ షెట్కార్, ఎస్‌కెఎస్ వెంకట్, అనుదీప్ సోదరుడు సందీప్ స్నేహితులు శివ దయల్ రెడ్డి, సుధీర్, ఉపాధ్యాయులు చంద్రకాంత్, శేఖర్, ఆర్టిస్టులు తరుణ్, నర్సింలు, ప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఆత్మీయత మరువలేనిది

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన ఫుల్ లెన్త్ కామెడీ ఫిల్మ్ జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీ తన బాల్య మిత్రులను కలిశాడు. ఒక సెలబ్రిటీగా మారినప్పటికినీ అదే పలకరింపు, అదే ఆత్మీయతతో ఉన్నాడన్నారు. మున్ముందు మరిన్ని మంచి సినిమాలతో విజయపథంలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తున్నామని అనుదీప్ స్నేహితులు తెలిపారు. నారాయణఖేడ్ ప్రాంత ఆర్టిస్టులకు కూడా ప్రోత్సాహం అందిస్తూ అవకాశాలు కూడా కల్పిస్తానని డైరెక్టర్ చెప్పడం సంతోషకరమని చెప్పారు.

Tags:    

Similar News