దిశ ఎఫెక్ట్ : కదిలిన సీఎంవో.. పోస్టింగ్‌లపై ఆర్డర్లు జారీ
దిశ, తెలంగాణ బ్యూరో : పదోన్నతులు పొందిన ఎక్సైజ్ అధికారులకు ఎట్టకేలకు పోస్టింగ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. దాదాపు 26 రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు మోక్షం లభించింది. ఎక్సైజ్‌లో పోస్టింగ్ ఆర్డర్లు పెండింగ్‌పై రెండు రోజుల కిందట ‘దిశ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పదోన్నతులు పొందిన ఆబ్కారీ అధికారులకు మంగళవారం ఉదయం నుంచి ఆర్డర్లు జారీ […]
దిశ, తెలంగాణ బ్యూరో : పదోన్నతులు పొందిన ఎక్సైజ్ అధికారులకు ఎట్టకేలకు పోస్టింగ్ ఆర్డర్లు జారీ అయ్యాయి. దాదాపు 26 రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు మోక్షం లభించింది. ఎక్సైజ్‌లో పోస్టింగ్ ఆర్డర్లు పెండింగ్‌పై రెండు రోజుల కిందట ‘దిశ’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ విషయంపై మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు పలువురు సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పదోన్నతులు పొందిన ఆబ్కారీ అధికారులకు మంగళవారం ఉదయం నుంచి ఆర్డర్లు జారీ చేస్తున్నారు.
ప్రస్తుతం ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పోస్టింగ్ జీవో విడుదలైంది. తొలుతగా 12 మందికి పోస్టింగ్‌లిచ్చారు. రంగారెడ్డి డీసీగా డేవిడ్ రవికాంత్, మహబూబ్‌నగర్ అసిస్టెంట్ కమిషనర్‌గా దత్తురాజ్ గౌడ్, మెదక్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీగా రఘురాం, నల్గొండ ఎన్ఫోర్స్మెంట్ఏసీగా శంభుప్రసాద్, రంగారెడ్డి ఎన్ఫోర్స్మెంట్ఏసీగా చంద్రయ్య, మేడ్చల్ ఈఎస్‌గా విజయ భాస్కర్, మల్కాజిగిరి ఈఎస్‌గా అరుణ్ కుమార్, శంషాబాద్ ఈఎస్‌గా ఏనుగుల సత్యనారాయణ, సంగారెడ్డి ఈఎస్‌గా గాయత్రి, సరూర్‌నగర్ ఈఎస్‌గా టి.రవీందర్రావు, మహబూబ్‌నగర్ ఈఎస్‌గా సైదులు, మెదక్ ఈఎస్‌గా అబ్దుల్ రజాక్‌కు పోస్టింగ్ ఇస్తూ జీవో జారీ చేశారు. మిగిలిన వారికి ఈ రెండు రోజుల వ్యవధిలో ఆర్డర్లు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇది కూడా చదవండి :
ఉద్యోగ పదోన్నతులు సీఎం ఓకే చెప్పినా సీఎస్ బ్రేక్.. కారణమేంటో..?