అమ్మోనియం నైట్రేట్‌పై అయోమయం

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ తీరం నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమ‌తిపై సందిగ్దం వీడట్లేదు. ఇప్పటికే మూడు నౌక‌లు ఈ ర‌సాయ‌నంతో విదేశాల నుంచి అన్ లోడింగ్ కోసం విశాఖ తీరంలో లంగ‌రు వేసుకుని కూర్చున్నాయి. మ‌రో నౌక ఈనెల చివరి వారంలో విశాఖ తీరానికి చేరుకోనుంది. మరోవైపు అమ్మోనియం నైట్రేట్ దిగుమ‌తి, స్టోరేజీ చేసే శ్రావ‌ణ్​ షిప్పింగ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కార‌ణంగా ఎన్‌ఓసీని పోలీసులు ర‌ద్దుచేశారు. షోకాజ్ నోటీసుకు నిర్ణీత గ‌డువులో స‌మాధానం ఇవ్వనందున ఎన్‌ఓసీని […]

Update: 2020-09-22 05:08 GMT

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ తీరం నుంచి అమ్మోనియం నైట్రేట్ దిగుమ‌తిపై సందిగ్దం వీడట్లేదు. ఇప్పటికే మూడు నౌక‌లు ఈ ర‌సాయ‌నంతో విదేశాల నుంచి అన్ లోడింగ్ కోసం విశాఖ తీరంలో లంగ‌రు వేసుకుని కూర్చున్నాయి. మ‌రో నౌక ఈనెల చివరి వారంలో విశాఖ తీరానికి చేరుకోనుంది. మరోవైపు అమ్మోనియం నైట్రేట్ దిగుమ‌తి, స్టోరేజీ చేసే శ్రావ‌ణ్​ షిప్పింగ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కార‌ణంగా ఎన్‌ఓసీని పోలీసులు ర‌ద్దుచేశారు. షోకాజ్ నోటీసుకు నిర్ణీత గ‌డువులో స‌మాధానం ఇవ్వనందున ఎన్‌ఓసీని రద్దు చేసినట్లు సీపీ తెలిపారు. మరోవైపు ఈ రసాయనాన్ని దిగుమ‌తి చేసే ఏకైక పోర్టు విశాఖే అయిన కారణంగా ఎరువులు, మైనింగ్ పరిశ్రమలు అమ్మోనియం నైట్రేట్​కోసం ఎదురు చూస్తున్నాయి.

Tags:    

Similar News