ఆ విషయం చాలా పర్సనల్ :దిగంగనా సూర్యవంశీ

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ దిగంగనా సూర్యవంశీ 23 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ నటించిన భామ.. లేటెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ద బ్యాటిల్ ఆఫ్ భీమా కొరెగావ్’లో నటించడం సంతృప్తినిచ్చిందని తెలిపింది. అర్జున్ రాంపాల్‌ హీరోగా వస్తున్న గొప్ప పీరియాడిక్ ఫిల్మ్‌లో యాక్ట్ చేయడం కల నిజమైనట్లుగా ఉందని చెప్పింది. వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వలేని ఒక పాత్ర లేదా యుగంలోకి వెళ్లడం అనేది కష్టంగా లేదా తేలికగా కూడా […]

Update: 2020-12-29 03:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ బ్యూటీ దిగంగనా సూర్యవంశీ 23 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ్‌తో పాటు హిందీలోనూ నటించిన భామ.. లేటెస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘ద బ్యాటిల్ ఆఫ్ భీమా కొరెగావ్’లో నటించడం సంతృప్తినిచ్చిందని తెలిపింది. అర్జున్ రాంపాల్‌ హీరోగా వస్తున్న గొప్ప పీరియాడిక్ ఫిల్మ్‌లో యాక్ట్ చేయడం కల నిజమైనట్లుగా ఉందని చెప్పింది.

వ్యక్తిగతంగా సాక్ష్యమివ్వలేని ఒక పాత్ర లేదా యుగంలోకి వెళ్లడం అనేది కష్టంగా లేదా తేలికగా కూడా ఉండొచ్చన్న ఆమె.. పీరియాడికల్ ఫిల్మ్ బ్యూటీనెస్ అదే అని తెలిపింది. ఆ పాత్రను ఊహించుకోవడం, స్క్రిప్టు చదివి అర్ధం చేసుకోవడం ద్వారానే మనం తెరపై జీవించాలని.. అప్పుడున్న కొన్ని విషయాలు ఇప్పుడు ఉనికిలో ఉండవని వెల్లడించింది. ‘ద బ్యాటిల్ ఆఫ్ భీమా కొరెగావ్’ చాలా అందమైన ప్రాజెక్ట్ అన్న దిగంగన.. ఈ సినిమా ద్వారా చాలా అంశాల గురించి తెలుసుకున్నాని చెప్పింది. పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అవుతాననేది చాలా పర్సనల్ విషయమని, అలాంటి ప్రశ్నకు సమాధానం కూడా చెప్పలేనంటూ.. సినిమా క్రియేటర్ రమేష్ తిటే విజన్‌కు మాత్రం సెల్యూట్ చేసింది. ఈ కాలంలో ఆనాటి యుగం గురించి వివరించాల్సిన అవసరం ఉందా? అన్న ప్రశ్నపై స్పందించిన హీరోయిన్.. లాక్‌డౌన్ పరిస్థితులు మనల్ని మనం రీబిల్డ్ చేసుకునేలా పాఠాలు నేర్పాయని, ఆత్మపరిశీలన చేసుకునేందుకు ఇలాంటి సినిమాలు ఉపయోగపడతాయని చెప్పొకొచ్చింది.

ఇక సమాజంలో అసమానతలున్నాయా? అంటే.. మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఖచ్చితంగా ఉన్నాయని స్పష్టం చేసింది దిగంగన. కానీ మనం కూడా ఇతరులకు అలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నామా? లేదా? అని ఆలోచించుకోవాలని, అప్పుడే కొంచెమైనా మార్పు వస్తుందని అభిప్రాయపడింది.

Tags:    

Similar News