‘పోలీసులు ప్రాణాలకు తెగించి పోరాడారు’

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కష్టకాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఏపీ పోలీసులు ప్రాణాలకు తెగించి పోరాడారని డీఐజీ పాల్రాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో సత్యదూరమైన అంశాలను పేర్కొన్నారని తెలిపారు. పోలీసుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. షేక్ సత్తార్‌పై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. దేవాలయాలపై జరిగిన దాడి కేసులో 178 మందిని అరెస్ట్ చేశామని స్పష్టం […]

Update: 2020-10-06 01:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కష్టకాలంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా ఏపీ పోలీసులు ప్రాణాలకు తెగించి పోరాడారని డీఐజీ పాల్రాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు డీజీపీకి రాసిన లేఖలో సత్యదూరమైన అంశాలను పేర్కొన్నారని తెలిపారు. పోలీసుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. షేక్ సత్తార్‌పై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేశామని వెల్లడించారు. దేవాలయాలపై జరిగిన దాడి కేసులో 178 మందిని అరెస్ట్ చేశామని స్పష్టం చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా పోలీసుల చట్టబద్ధత, ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా ఎవరూ మాట్లాడొద్దని డీఐజీ పాల్రాజు కోరారు.

Tags:    

Similar News