ఎమ్మెల్సీగా ఉబలాటం తీరకముందే నాగబాబుకు షాక్.. అయోమయంలో జనసేన
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు టీడీపీ నేతలు ఊహించని షాక్ ఇచ్చారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు టీడీపీ నేతలు ఊహించని షాక్ ఇచ్చారు. రెండో రోజు పిఠాపురం నియోజకవర్గంలోని కుమారపురంలో అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్లిన నాగబాబును చుట్టుముట్టారు. టీడీపీ నేతలు జై వర్మ అంటూ నినాదాలు చేశారు. దీంతో నాగబాబు వారిపై అసహనం వ్యక్తం చేశారు. అసలు అక్కడ ఏం జరిగింది? వారి అసహనానికి కారణం ఏంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
కాంగ్రెస్‌కు దమ్ముంటే బియ్యం పంపిణీలో కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత అనే దానిపై రేషన్ షాపుల వద్ద డిస్ ప్లే చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మొన్నటి నుంచి కాంగ్రెస్ ప్రారంభించిన సన్న బియ్యం పథకం.. ప్రధాని మోడీ బియ్యమే పంపిణీ చేస్తున్నారని అన్నారు. కేంద్రం ఉచితంగా అందిస్తున్న బియ్యాన్ని సక్రమంగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బియ్యం పంపిణీపై హాట్ కామెంట్స్ చేశారు. ఇంకా బండి సంజయ్ ఏం మాట్లాడారో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
ఏపీ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందని, అప్పు ఇచ్చేవాళ్లు కనిపించడం లేదని సీఎం చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో ఐదేళ్లు అధికారంలో ఉన్న వైసీపీ రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి జంప్ అయ్యిందని విమర్శించారు. అమెరికా టారీఫ్ ల పెంపుతో ఏపీ అక్వాకల్చర్ దెబ్బతినే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిని ఎలా ఎదుర్కోవాలో ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకుంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్డీఆర్ జిల్లా ముప్పాళ్లలో పర్యటించిన సీఎం.. పలు సంచలన విషయాలు వెల్లడించారు. ఆ వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేసి చూడండి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల కోరికల్లో ఒకటైన ఆదిలాబాద్ విమానాశ్రయానికి మోక్షం లభించింది. ఈ నెల 2న భారత వాయుసేన తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ తెలంగాణ ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో మరో ముందడుగు పడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింకులో చూడండి.