శార్దుల్ ఠాకూర్ బౌలింగ్ యాక్షన్‌పై చర్చ
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో శార్దుల్ ఠాకూర్ బంతితో పాటు బ్యాటుతో కూడా రాణించి విజయంలోకీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 30 పరుగులతో పాటు నాలుగు వికెట్లు కూడా తీశాడు. కాగా, శార్దుల్ వేసిన బంతుల్లో ఒక దానికి సంబంధించిన యాక్షన్ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక బంతిని మధ్యవేలితో మాత్రమే పట్టుకొని వేయడం కనిపించింది. నకుల్ బాల్ లాగా ఇదేమైనా కొత్త బాలా అంటూ నెటిజన్లు మీమ్స్ […]
దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో శార్దుల్ ఠాకూర్ బంతితో పాటు బ్యాటుతో కూడా రాణించి విజయంలోకీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 30 పరుగులతో పాటు నాలుగు వికెట్లు కూడా తీశాడు. కాగా, శార్దుల్ వేసిన బంతుల్లో ఒక దానికి సంబంధించిన యాక్షన్ సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక బంతిని మధ్యవేలితో మాత్రమే పట్టుకొని వేయడం కనిపించింది. నకుల్ బాల్ లాగా ఇదేమైనా కొత్త బాలా అంటూ నెటిజన్లు మీమ్స్ చేస్తున్నారు. శార్దుల్ ఠాకూర్ ఇన్ని వేరియేషన్స్ వేయగలడని మేం తొలి సారిగా చూస్తున్నామని క్రికెట్ అభిమానులు కూడా అంటున్నారు. మరోవైపు చివరి వన్డేలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ శార్దుల్‌కు ఇవ్వకపోవడంపై కెప్టెన్ కోహ్లీ కూడా ఆశర్చర్యం వ్యక్తం చేశాడు.