నా రాజకీయ లబ్ధి కోసం రాలే.. ఓయూలో ఆర్ఎస్పీ కీలక వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో : రాజ‌కీయ ల‌బ్ధి కోసం తాను ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదని, విద్యార్థుల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకుందామని వచ్చానని బీఎస్పీ స్టేట్​కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంట్రల్ లైబ్రరీని ఆయన బుధవారం సందర్శించారు. ఈ నేపథ్యంలో అక్కడి విద్యార్థులు, పరిశోధకులు, నిరుద్యోగుల‌తో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. వారి సమస్యలను అడిగి నేరుగా తెలుసుకున్నారు. అనంతరం ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు ప్రొఫెసర్లు లేక వెలవెలబోతున్నాయని అన్నారు. ఏళ్ల తరబడి […]

Update: 2021-11-24 11:03 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాజ‌కీయ ల‌బ్ధి కోసం తాను ఉస్మానియా యూనివర్సిటీకి రాలేదని, విద్యార్థుల సమస్యలు నేరుగా అడిగి తెలుసుకుందామని వచ్చానని బీఎస్పీ స్టేట్​కోఆర్డినేటర్​డాక్టర్​ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంట్రల్ లైబ్రరీని ఆయన బుధవారం సందర్శించారు. ఈ నేపథ్యంలో అక్కడి విద్యార్థులు, పరిశోధకులు, నిరుద్యోగుల‌తో ప్రత్యేకంగా సమావేశమై మాట్లాడారు. వారి సమస్యలను అడిగి నేరుగా తెలుసుకున్నారు.

అనంతరం ఆర్ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని వర్సిటీలు ప్రొఫెసర్లు లేక వెలవెలబోతున్నాయని అన్నారు. ఏళ్ల తరబడి లెక్చరర్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయకపోవడం, ఉద్యోగ విరమణ పొందుతున్న వారి స్థానాలను అలాగే వదిలేస్తుండటంతో బోధన ప్రమాణాలు నానాటికీ పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో మంది యువ‌త తెలంగాణ ఉద్యమం కోసం ఆత్మబలిదానాలు చేసుకున్నారని, కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాల కోసం బ‌లిదానం చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శలు గుప్పించారు. విద్యార్థులకు బీఎస్పీ ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని, విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకొని, త‌ల్లిదండ్రుల‌కు క‌డుపుకోత మిగల్చవద్దని విన్నవించారు. నిరుద్యోగులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆర్​ఎస్పీ సూచించారు.

ఈ సందర్భంగా ఓయూ విద్యార్థులు తమ సమస్యలను ఆర్ఎస్పీ వద్ద ఏకరువు పెట్టారు. సమస్యలపై స్పందించిన ఆయన రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రిజర్వేషన్లను తొలగించి తీరని అన్యాయం చేసిందని ఘాటుగా విమర్శించారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను సృష్టిస్తామని హామీ ఇచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంతో పాటు, రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలను ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలుగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని తెలిపారు.

అండర్ ట్రయల్​ఖైదీల కంటే తక్కువ మెస్ చార్జీలా?

ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల పరిస్థితి చాలా దయనీయంగా ఉందని ఆర్ఎస్పీ ట్వీట్ చేశారు. ఏ డిపార్ట్​మెంట్‌లో కూడా ఉపాధ్యాయులు పూర్తిగా లేరని చదువుకోవడానికి లైబ్రరీల్లో, హాస్టళ్లలో కనీసం రీడింగ్​రూమ్స్​కూడా లేవని పేర్కొన్నారు. విద్యార్థుల మెస్​చార్జీలు అండర్​ట్రయల్​ఖైదీల కన్నా తక్కువగా ఉండటం దారుణమన్నారు. విద్యార్థులకు చెల్లించేది రూ.50 అయితే.. ఖైదీలకు రూ.68.5 ఇస్తారని ట్వీట్‌లో పేర్కొన్నారు. సమస్యలు చెబుతూ.. విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకున్నారని, సెల్ఫ్​ఫైనాన్స్​కోర్సుల వల్ల తల్లిదండ్రులపై పెను భారం పడుతోందని చెప్పి విద్యార్థులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. రీసర్చ్​స్కాలర్లకు ఎలాంటి సపోర్ట్​లేక వారి పరిస్థితి మరింత అగమ్యగోచరంగా తయారైందన్నారు. అత్యంత ప్రతిభ ఉన్న ఈ బిడ్డలపై పాలకులు చాలా కక్ష కట్టారని ఆర్ఎస్​ప్రవీణ్​కుమార్​ట్వీట్​చేశారు.

అన్ని విశ్వవిద్యాలయాల్లో కలిపి దాదాపు 1,700కు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయని, విద్యార్థుల గోడును వినేవారెవరూ లేకపోవడంతో దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆర్​ఎస్​ప్రవీణ్​కుమార్​ఆవేదన వ్యక్తంచేశారు. ఏడున్నరేళ్లుగా వర్సిటీల్లోని విద్యార్థులకు చెందాల్సిన డబ్బులు ఏమయ్యాయని, ఎవరు దొంగిలించారని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీ సాక్షిగా ప్రైవేట్​యూనివర్సిటీల చట్టాన్ని తీసుకొచ్చి, ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసి, పేద బిడ్డల భవిష్యత్తును నాశనం చేసిన ఈ గడీల దోపిడీ ప్రభుత్వానికి చరమగీతం పాడాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పుడున్న చంచాల స్థానంలో నిఖార్సైన బహుజన ప్రజాప్రతినిధులు చట్ట సభల్లోకి రావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.

ల్యుకేమియా పిల్లలతో గడపడం సంతోషాన్నిచ్చింది

తన పుట్టిన రోజును ల్యుకేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల నడుమ జరుపుకోవడం ఎంతో సంతోషాన్నిచ్చిందని మాజీ ఐపీఎస్, బీఎస్పీ స్టేట్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్​చేశారు. తన పుట్టినరోజును జీవితాంతం గుర్తుండిపోయేలా మార్చిన ప్రతి ఒక్కరికీ బిలియన్​ధన్యవాదాలంటూ పేర్కొన్నారు. ముఖ్యంగా ల్యుకేమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లలతో గడపడం, ఆటో, క్యాబ్​డ్రైవర్​స్నేహితులతో ర్యాలీ నిర్వహించడం ఎన్నటికీ మరిచిపోనని తెలిపారు. ఇంత పెద్ద కుటుంబంలో తాను కూడా బాగమైనందుకు ఎంతో గర్వంగా ఉందని ఆయన ట్వీట్​చేశారు.

Tags:    

Similar News