వామ్మో.. ధోనీ జీతం రూ.150 కోట్లా!

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోనీ ఒక సంచలనం. దేశానికి ధోనీ అందించిన సేవలు అంతఇంతా కాదు. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ. 2004లో కెరీర్‌ను ఆరంభించిన మహీ గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై చివరి మ్యాచ్‌ ఆడాడు. నాటి నుంచి నేటి వరకూ అత్యద్భుత సారథిగా, గొప్ప ఫినిషర్‌గా కీర్తి సంపాదించాడు. అంతేగాకుండా సూపర్‌ కెప్టెన్సీ, కూల్ కెప్టెన్సీ, జట్టును విజయపథంలో నడిపించిన మహా […]

Update: 2021-02-02 03:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ చరిత్రలో మహేంద్రసింగ్ ధోనీ ఒక సంచలనం. దేశానికి ధోనీ అందించిన సేవలు అంతఇంతా కాదు. భారత క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న మహేంద్రసింగ్‌ ధోనీ. 2004లో కెరీర్‌ను ఆరంభించిన మహీ గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్‌పై చివరి మ్యాచ్‌ ఆడాడు. నాటి నుంచి నేటి వరకూ అత్యద్భుత సారథిగా, గొప్ప ఫినిషర్‌గా కీర్తి సంపాదించాడు. అంతేగాకుండా సూపర్‌ కెప్టెన్సీ, కూల్ కెప్టెన్సీ, జట్టును విజయపథంలో నడిపించిన మహా నాయకుడు అన్న పదానికే కొత్త అర్థం చెప్పాడు. తన సంచలన ఆటతీరుతో భారత క్రికెట్‌ను శిఖరాగ్రాన నిలిపాడు. కూలెస్ట్‌ కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్న ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ అత్యంత కూల్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

అంతేగాకుండా.. ధోనీ దేశానికే కాకుండా బీసీసీఐ ప్రతీ ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఐపీఎల్‌లో కూడా అద్భుతంగా రాణించాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు నాయకత్వం వహించిన మహీ.. మూడుసార్లు జట్టుకు ట్రోఫి అదించాడు. ఆడిన ప్రతీ సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేర్చాడు. ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన జట్టుగా గుర్తింపు తెచ్చాడు. అంతేగాకుండా 2016, 2017 రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో రంగంలోకి దిగిన చెన్నై సూపర్‌కింగ్స్‌ అద్భుతమైన పునరాగమనాన్ని ఘనంగా చాటింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై విజయం సాధించి, మూడోసారి ట్రోఫి గెలుచుకోవడంలో ఎంతో కృషి చేశాడు మహీ.

ఇంత ఘనత కలిగిన మహీ.. రానున్న ఐపీఎల్‌లో రికార్డు సృష్టించనున్నాడు. ఐపీఎల్ అన్ని సీజ‌న్లలో క‌లిపి రూ.150 కోట్ల వేతనం తీసుకున్న ఆటగాడిగా ధోనీ వ‌చ్చే సీజ‌న్‌లో రికార్డు నెల‌కొల్పనున్నాడు. ఇప్పటివరకూ ఐపీఎల్‌లో ఇంత‌ వేత‌నం తీసుకున్న ఆట‌గాడు లేడని బీసీసీఐ వర్గాల సమాచారం. మొత్తం 13 సీజన్‌లు కలుపుకుని ఆయ‌న అంద‌రికంటే అధికంగా రూ.137 కోట్లను వేతనంగా తీసుకున్నాడు. 2008లో చెన్నై టీమ్ ఏడాదికి రూ.6 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.18 కోట్లకు కొనుక్కుని ఆడించింది. అనంత‌రం మ‌రో మూడేళ్ల పాటు ఆయ‌న‌ రూ.8.28 కోట్ల చొప్పున తీసుకున్నాడు. 2014, 2015 సీజ‌న్‌ల‌లో ఏడాదికి రూ.12.5 కోట్ల చొప్పున తీసుకున్నాడు. 2018 ఐపీఎల్‌లో ఏడాదికి రూ.15 కోట్లు చొప్పున మూడేళ్లలో రూ.45 కోట్లు తీసుకున్నాడు. అనంతరం(2021) సీజన్‌లోనూ ఆయ‌న రూ.15 కోట్లు తీసుకోనున్నాడు.

ఈ సీజ‌న్‌లో ఆడితే ఆయ‌న తీసుకున్న మొత్తం వేతనం రూ.150 కోట్లు అవుతుంది. ధోనీ త‌ర్వాత అత్యధిక వేత‌నం తీసుకున్న ఆట‌గాళ్లుగా రూ.131 కోట్లతో రోహిత్‌శర్మ, రూ.126 కోట్లతో విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇప్పటికే 2018 వరల్డ్ కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ, గతేడాది అన్ని ఫార్మాట్లకు దూరంగా ఉన్నాడు. కానీ, ఐపీఎల్‌లో ఆడాడు. వచ్చేసారి కూడా కచ్చితంగా చైన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనినే నాయకత్వం వహించనున్నాడని జట్టు యాజమాన్యం ఇప్పటికే ప్రటించింది. ధోనీ కూడా వచ్చే సీజన్‌లో తప్పకుండా ఆడతానని స్పష్టం చేశాడు. టీమిండియాలో ధోనీ ప్రదర్శనను ఎంతగానో మిస్ అవుతున్న క్రీడాభిమానులు ధోనీ ఆటను చూడాలని మరో రెండు నెలలు వేచి ఉండాల్సిందే.

Tags:    

Similar News