గంగూలీ కష్ట ఫలితాన్ని ధోని అనుభవించాడు: గంభీర్
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత అదృష్టవంతుడైన కెప్టెన్ ఎంఎస్ ధోనీ అని, అతనికి ఒక గొప్ప టీం వారసత్వంగా లభించిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఒక బలమైన జట్టును తయారు చేయడానికి సౌరవ్ గంగూలీ ఎంతో కష్టపడ్డాడని, ఆ ప్రతిఫలాన్ని ధోనీ అనుభవించాడని ఒక కార్యక్రమంలో గంభీర్ అభిప్రాయపడ్డాడు. తానూ, ధోనీ ఒకే గదిలో నెల రోజులు ఉన్నామని గంభీర్ చెప్పాడు. ఆ గదిలో ఇద్దరం నేలపైనే పడుకునే వారిమని గుర్తు […]
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత అదృష్టవంతుడైన కెప్టెన్ ఎంఎస్ ధోనీ అని, అతనికి ఒక గొప్ప టీం వారసత్వంగా లభించిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. ఒక బలమైన జట్టును తయారు చేయడానికి సౌరవ్ గంగూలీ ఎంతో కష్టపడ్డాడని, ఆ ప్రతిఫలాన్ని ధోనీ అనుభవించాడని ఒక కార్యక్రమంలో గంభీర్ అభిప్రాయపడ్డాడు. తానూ, ధోనీ ఒకే గదిలో నెల రోజులు ఉన్నామని గంభీర్ చెప్పాడు. ఆ గదిలో ఇద్దరం నేలపైనే పడుకునే వారిమని గుర్తు చేశాడు. ‘ప్రతి ఫార్మాట్‌లోనూ ధోనీకి అద్భుతమైన జట్టు దొరకడం అదృష్టం. సచిన్, సెహ్వాగ్, యువరాజ్, విరాట్‌తోపాటు నేను జట్టులో ఉండడం వల్ల 2011 వరల్డ్ కప్‌లో ధోనీకి సారథ్యం ఎంతో సులువైంది. అయితే, ఇలాంటి వారిని తయారు చేయడానికి దాదా ఎంతో కష్టపడ్డాడు. అందుకే, గంగూలీ వల్లే ధోనీ ఎన్నో టైటిళ్లు సాధించాడు’ అని గంభీర్ అభిప్రాయపడ్డాడు. జహీర్ ఖాన్ అత్యుత్తమ బౌలర్, అతడి వల్లే ధోనీ భారత జట్టును టెస్టుల్లో నెంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లగలిగాడని చెప్పాడు.