తన నిర్ణయంపై యూటర్న్ తీసుకున్న ధోనీ
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో చివరి మ్యాచ్ చెన్నైలో ఆడతానని.. తాను చేపాక్ స్టేడియంలో ఆడే వీడ్కోలు మ్యాచ్‌లు సీఎస్కే ఫ్యాన్స్ భారీగా తరలి రావాలని ఎంఎస్ ధోనీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో కానీ వచ్చే ఏడాది తాను ఐపీఎల్ ఆడతానో లేదో అని అనుమానం వ్యక్తం చేశాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో తన అనుబంధం కొనసాగుతుందని.. అయితే జట్టు తరపున ఆడతానో లేదో మాత్రం తెలియదని చెప్పాడు. తాను మ్యాచ్ […]
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్‌లో చివరి మ్యాచ్ చెన్నైలో ఆడతానని.. తాను చేపాక్ స్టేడియంలో ఆడే వీడ్కోలు మ్యాచ్‌లు సీఎస్కే ఫ్యాన్స్ భారీగా తరలి రావాలని ఎంఎస్ ధోనీ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కానీ ఇప్పుడు ఏమైందో ఏమో కానీ వచ్చే ఏడాది తాను ఐపీఎల్ ఆడతానో లేదో అని అనుమానం వ్యక్తం చేశాడు. చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో తన అనుబంధం కొనసాగుతుందని.. అయితే జట్టు తరపున ఆడతానో లేదో మాత్రం తెలియదని చెప్పాడు. తాను మ్యాచ్ ఆడాలంటే అది రిటెన్షన్‌పై ఆధారపడి ఉంటుందని.. తనను ఉంచుకోవాలా లేదా అనేది చెన్నయ్ యాజమాన్యం ఇష్టమని చెప్పాడు. ‘వచ్చే ఏడాది పసుపు దుస్తుల్లోనే చూడవచ్చు. అయితే జట్టు తరపున ఆడతానో లేదో తెలియదు. వచ్చే ఏడాది రెండు కొత్త జట్లు వస్తున్నాయి. నన్ను రిటైన్ చేసుకోవడానికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయో తెలియదు. రిటెన్షన్ విధానంపైనే తాను ఆడేది ఆధారపడి ఉంటుంది’ అని ధోనీ అన్నాడు.