Dhoni: ఆ క్రెడిట్ అంతా ధోనీకే దక్కుతుంది : దీపక్ చాహర్
దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో దీపక్ చాహర్ వీరోచితంగా పోరాడి భారత జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. కీలకమైన వికెట్లన్నీ కోల్పోయిన సమయంలో బ్యాటింగ్‌కు దిగిన చాహర్ 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత జట్టును గెలిపించాడు. కాగా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మ్యాచ్ ముగించే విధానాన్ని దగ్గర నుంచి చూడటం తనపై ప్రభావాన్ని చూపిందని.. తాను కూడా అలాంటి ఇన్నింగ్స్ ఆడానని దీపక్ చాహర్ అంటున్నాడు. ‘లక్ష్య […]
దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో దీపక్ చాహర్ వీరోచితంగా పోరాడి భారత జట్టుకు విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. కీలకమైన వికెట్లన్నీ కోల్పోయిన సమయంలో బ్యాటింగ్‌కు దిగిన చాహర్ 69 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత జట్టును గెలిపించాడు. కాగా, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మ్యాచ్ ముగించే విధానాన్ని దగ్గర నుంచి చూడటం తనపై ప్రభావాన్ని చూపిందని.. తాను కూడా అలాంటి ఇన్నింగ్స్ ఆడానని దీపక్ చాహర్ అంటున్నాడు.
‘లక్ష్య ఛేదనలో ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యే సమయంలో చివరకు వరకు ఎలా తీసుకెళ్లాలనే విషయాన్ని ధోనీ ప్రతీ సారి చెప్పేవాడు. ఆ సూత్రంతోనే తాను మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లాను. ఆ రోజు నేను ఆడిన ఇన్నింగ్స్ క్రెడిట్ అంతా ధోనీకే చెందుతుంది’ అని చాహర్ పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో సుదీర్ఘ కాలంగా ఉంటూ ధోనీ ఆటను గమనించాను. అదే నాకు గుర్తుకు వచ్చింది. ధోనీ మాటలను గుర్తు పెట్టుకొని తాను అలా ఆడగలిగానని దీపక్ చాహర్ చెప్పుకొచ్చాడు.