కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ధర్నా
దిశ ప్రతినిధి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మొదటి పీఆర్సీలో రెగ్యులర్ ఎంప్లాయిస్‌తో సమానంగా వేతనాలను అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా గురువారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ప్రధాన రోడ్డైపై బైఠాయించి తమ న్యాయమైన సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. సుల్తాన్ […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మొదటి పీఆర్సీలో రెగ్యులర్ ఎంప్లాయిస్‌తో సమానంగా వేతనాలను అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా గురువారం కోఠిలోని కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు ప్రధాన రోడ్డైపై బైఠాయించి తమ న్యాయమైన సమస్యలు తీర్చాలని డిమాండ్ చేశారు. సుల్తాన్ బజార్ పోలీసులు అదనపు బలగాలను రప్పించి ధర్నా చేస్తున్న వారిలో వంద మందికి పైగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు భూపాల్, ప్రధాన కార్యదర్శి కె యాద నాయక్ లు కాంట్రాక్ట, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులతో కలిసి మాట్లాడుతూ రెగ్యులర్ ఎంప్లాయిస్ తో సమానంగా సేవలు అందిస్తున్నప్పటికీ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయకపోవడంతో వారు చాలీ చాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం వెంటనే వారి సేవలు గుర్తించి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా జీఓ నెంబర్ 19 ప్రకారం కాంట్రాక్ట్ పారామెడికల్ ఉద్యోగుల సర్వీసులను కోర్టులో ఉన్న కేసులకు పరిష్కారం చూపి క్రమ బద్ధీకరించాలని, పీఆర్సీ ప్రతిపాదించిన విధంగా 3 క్యాటగిరీలలో కనీస వేతనాలు రూ 19 వేలు, రూ 22 వేలు, రూ 31,040 వర్తింపజేయాలని, జీఓ నెంబర్ 60కి సవరణలు చేయాలన్నారు. ప్రభుత్వం 2018 లో జారీ చేసిన జీఓ నెంబర్ 510 ని ఉద్యోగులందరికీ అమలు చేయడంతో పాటు ఇందులో సీఓ, మెడికల్ అసిస్టెంట్, అకౌంటెంట్, వాచ్ మెన్, స్వీపర్స్, కంప్యూటర్ ఆపరేటర్లను చేర్చాలన్నారు. టిమ్స్ ఆస్పత్రిలో తొలగించిన సిబ్బందితో పాటు కొవిడ్ కాలంలో నియమించబడి తొలగింపుకు గురైన 1640 స్టాఫ్ నర్సులను తిరిగి విధులలోకి తీసుకువాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బలరాం, ఫసియుద్ధిన్, కవిత, విజయవర్ధన్ రాజు, కుమార్, నవీన్, సాదుల్లా, రహీం, సరోజ, వాణి, మీన తదితరులు పాల్గొన్నారు.