బిగ్ బ్రేకింగ్: రేవంత్ రెడ్డి ఇంట్లో ధర్మపురి, గండ్ర, ఎర్ర శేఖర్ భేటీ
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, త్వరలోనే కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, మహబూబ్‌నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీనియర్నేత గండ్ర సత్యనారాయణ వెల్లడించారు. రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్బలోపేతమవుతోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం రేవంత్రెడ్డి నివాసంలో పలువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. అనంతరం […]
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని, త్వరలోనే కాంగ్రెస్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, మహబూబ్‌నగర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీనియర్నేత గండ్ర సత్యనారాయణ వెల్లడించారు. రేవంత్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్బలోపేతమవుతోందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం రేవంత్రెడ్డి నివాసంలో పలువురు నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.
అనంతరం ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ..కాంగ్రెస్‌లో పుట్టి పెరిగానని, కొన్ని కారణాలతో బయటకు వెళ్లాల్సి వచ్చిందని, నాన్న కోసమే టీఆర్‌ఎస్‌లో చేరానన్నారు. టీఆర్ఎస్కండువా ఒక గొడ్డలి వంటిదని, టీఆర్ఎస్అసలు రాజకీయ పార్టీ కాదని, అందులో నేతలకు విలువ లేదని, జిల్లా అధ్యక్షుడికి కూడా గుర్తింపు ఉండదన్నారు. రేవంత్రెడ్డి నాయకత్వాన్ని బలపర్చేందుకు తిరిగి కాంగ్రెస్ గూటికి వస్తున్నానని, త్వరలోనే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతానని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు ఎర్ర శేఖర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం వస్తుందన్నారు. బీజేపీ సభ్యత్వానికి, జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఎర్ర శేఖర్ ప్రకటించారు. కాంగ్రెస్‌లో చేరేందుకే బీజేపీకి రాజీనామా చేస్తున్నానని వెల్లడించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టీడీపీ నేత గండ్ర సత్యనారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామని, త్వరలోనే భూపాలపల్లిలో భారీ ఎత్తున బహిరంగ సభ పెట్టి పార్టీలో చేరుతామని స్పష్టం చేశారు.