మతిస్థిమితం కోల్పోయిన కేసీఆర్‌కు చికిత్స అవసరం: అర్వింద్

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ సీఎం పదవిని కాలి చెప్పుతో పోల్చి హేళన చేసినందుకు ఆయనను తక్షణం ఆ పోస్టు నుంచి తొలగించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌కు లేఖ రాశారు. ఆయన సీఎం పోస్టును అవమానించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆ లేఖలో పేర్కొన్నారు. మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న కేసీఆర్‌కు వెంటనే తగిన చికిత్స అందజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలో […]

Update: 2021-02-08 09:22 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ సీఎం పదవిని కాలి చెప్పుతో పోల్చి హేళన చేసినందుకు ఆయనను తక్షణం ఆ పోస్టు నుంచి తొలగించాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గవర్నర్‌ తమిళిసై సౌందర్ రాజన్‌కు లేఖ రాశారు. ఆయన సీఎం పోస్టును అవమానించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని ఆ లేఖలో పేర్కొన్నారు. మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న కేసీఆర్‌కు వెంటనే తగిన చికిత్స అందజేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సీఎంగా ఎవరిని ఎన్నుకోవాలో ఎమ్మెల్యేలకు సర్వ హక్కులూ, స్వేచ్ఛ ఉన్నాయని.. కానీ దానికి విరుద్ధంగా కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం అప్రజాస్వామికమన్నారు. ఆయన అవమానించడం వల్లే ప్రొఫెసర్ జయశంకర్ మానసిక క్షోభతో చనిపోయారని అరవింద్ ఆరోపించారు. 2023 ఎన్నికల్లో ఆయన సీఎంగా ఉండగానే ఓడించి బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కొడుకును సీఎం చేయడం కంటే తెలంగాణలో బీసీ కులానికి చెందిన ఈటల రాజేందర్‌కు మాత్రమే అవకాశం ఉందన్నారు.

Tags:    

Similar News