ధర్మపురి అర్వింద్ ఓ ఫేక్ ఎంపీ

దిశ, ఆర్మూర్: బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫేక్ సర్టిఫికెట్‌తో గెలిచి రైతులను మోసం చేస్తున్నారని, ఆయన ఓ ఫేక్ ఎంపీ అని మండిపడ్డారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డ్ తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మాట తప్పారని విమర్శించారు. దమ్ముంటే పసుపు బోర్డ్ తేవాలని డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ ఇంట్లో మూడు పార్టీలు […]

Update: 2021-07-19 05:28 GMT

దిశ, ఆర్మూర్: బీజేపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడాలని, లేకుంటే తగిన గుణపాఠం చెబుతామని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఫేక్ సర్టిఫికెట్‌తో గెలిచి రైతులను మోసం చేస్తున్నారని, ఆయన ఓ ఫేక్ ఎంపీ అని మండిపడ్డారు. ఎంపీ అరవింద్ పసుపు బోర్డ్ తెస్తానని బాండ్ పేపర్ రాసిచ్చి మాట తప్పారని విమర్శించారు. దమ్ముంటే పసుపు బోర్డ్ తేవాలని డిమాండ్ చేశారు. ఎంపీ అరవింద్ ఇంట్లో మూడు పార్టీలు ఉన్నాయని, ఎవరు ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో బీజేపీకి నలుగురు ఎంపీలు ఉన్నారని, కేంద్రం నుంచి మిషన్ భగీరథకు నిధులు తేవాలని కోరారు. ప్రాజెక్ట్ ద్వారా రైతులకు నీళ్లు ఇస్తే బీజేపీ ఓర్వలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులు ఆనందంగా ఉన్నారని అన్నారు. నందిపేట్ మండలంలో సోమవారం నూతనంగా నిర్మించిన రైతువేదికను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

Tags:    

Similar News