ధరణి కి సిద్ధం కావాలి
దిశ, ఆందోల్: ఈనెల 25న ధరణి పోర్టల్ ప్రారంభమవుతుందనీ, దీన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. జోగిపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధరణి కేంద్రంలో డెమో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూముల రిజిస్ట్రేషన్ లు, మ్యూటేషన్లపై జాయింట్ రిజిస్ట్రార్‌గా తహశీల్దార్లు వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. పారదర్శకంగా, జవాబుదారీ తనంగా, భద్రతతో కూడిన […]
దిశ, ఆందోల్: ఈనెల 25న ధరణి పోర్టల్ ప్రారంభమవుతుందనీ, దీన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు. జోగిపేట తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధరణి కేంద్రంలో డెమో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూముల రిజిస్ట్రేషన్ లు, మ్యూటేషన్లపై జాయింట్ రిజిస్ట్రార్‌గా తహశీల్దార్లు వ్యవహరిస్తారని ఆయన తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్నారు. పారదర్శకంగా, జవాబుదారీ తనంగా, భద్రతతో కూడిన ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు.