కరోనా ప్రభావం కొంత.. ధరణి మరింత..!

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరం వరుసగా కరోనా, లాక్ డౌన్, రిజిస్ట్రేషన్లపై నిషేధం, ఎల్ఆర్ఎస్ పథకం.. ఇలా అన్నీ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసినవే ఉన్నాయి. ప్రధానంగా ధరణి పోర్టల్ రూపకల్పనలో జాప్యం నష్టాన్ని కలిగిస్తోంది. జనం గగ్గోలు పెడుతున్నారని గుర్తించి అన్నీ రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అప్పటికే నష్టం వాటిల్లింది. ఇప్పటికింకా రూ.2550 కోట్లే సమకూరాయి. గతేడాది ఆదాయం రూ.7061 కోట్లుగా ఉంది. మరిప్పుడు ఉన్న రెండు […]

Update: 2021-01-07 23:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ ఆర్థిక సంవత్సరం వరుసగా కరోనా, లాక్ డౌన్, రిజిస్ట్రేషన్లపై నిషేధం, ఎల్ఆర్ఎస్ పథకం.. ఇలా అన్నీ ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసినవే ఉన్నాయి. ప్రధానంగా ధరణి పోర్టల్ రూపకల్పనలో జాప్యం నష్టాన్ని కలిగిస్తోంది. జనం గగ్గోలు పెడుతున్నారని గుర్తించి అన్నీ రకాల ఆస్తుల రిజిస్ట్రేషన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అప్పటికే నష్టం వాటిల్లింది. ఇప్పటికింకా రూ.2550 కోట్లే సమకూరాయి. గతేడాది ఆదాయం రూ.7061 కోట్లుగా ఉంది. మరిప్పుడు ఉన్న రెండు నెల్లల్లో అంత ఆదాయం సమకూరడం కష్టమేనని తెలుస్తోంది. వాస్తవానికి కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కాలంలోనూ గతేడాది మాదిరిగానే డాక్యుమెంట్లు జరిగాయి. కేవలం ప్రభుత్వ నిర్ణయాల వల్లే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని అధికారిక లెక్కలే చెబుతున్నాయి.

ఈసారి రాష్ట్ర ఖజానాకు అధికారులు, ప్రభుత్వ నిర్ణయం పెద్ద గండినే పెట్టిందని అర్థమవుతోంది. అధికారుల అంచనాలన్నీ తలకిందులైనట్లు తెలుస్తోంది. గతేడాది మార్చి ఆర్థిక సంవత్సరానికి 16.59 లక్షల డాక్యుమెంట్లతో రూ.7061 కోట్ల ఆదాయం సమకూరింది. అదిప్పటికైతే కేవలం రూ.2549 కోట్లకే చేరింది. 6.18 లక్షల డాక్యుమెంట్లే చేశారు. మరో రెండున్నర నెలల్లో 10 లక్షల క్రయ విక్రయాలు జరగడం అసాధ్యమంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం విధించిన అనేక ఆంక్షల కారణంగా ఏ ప్రాపర్టీ కొనాలో, ఆ భూమిపై ఏ వివాదం ఉన్నదోనన్న అనుమానాలు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు ఆచితూచి అడుగేస్తున్నారు. గతంలో ప్రతి మధ్య తరగతి కుటుంబం కూడా అవసరాలకు ఉపయోగడుతుందంటూ ఏదో ఒక ఆస్తిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసేవారు. ఆఖరికి ఈఎంఐ సదుపాయంలోనైనా ప్లాటు కొనాలని తాపత్రయపడేవారు. ఇప్పుడా ఆశలు కరోనాతోనూ నీరసించాయి. ధరణి పోర్టల్, కొత్త విధానాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని భావించారు. కానీ ఈ ఏడాదికైతే నష్టాలేనని ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి.

మొత్తం సర్కారే చేసింది!

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న కాలంలోనూ గతేడాది మాదిరిగానే డాక్యుమెంట్లు జరిగాయి. ఏప్రిల్ నెలలో మాత్రమే కరోనా ప్రభావం రిజిస్ట్రేషన్లపై చూపించింది. ఆ తర్వాత మే నుంచి సెప్టెంబరు వరకు ఎలాంటి అవరోధాలు లేకుండా జరిగాయి. కేవలం ప్రభుత్వ నిర్ణయాల వల్లనే రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. భూముల క్రయ విక్రయాలపై లాక్‌డౌన్ ప్రభావం పెద్దగా లేదని తెలుస్తోంది. కానీ రిజిస్ట్రేషన్ల నిలిపివేత, ధరణి పోర్టల్ రూపకల్పన, ఎల్ఆర్ఎస్ తప్పనిసరి లాంటి అంశాలే ప్రతికూలంగా మారినట్లు సమాచారం. గతేడాడి డిసెంబరుతో పోలిస్తే 2019-20లో 12.66 లక్షల డాక్యుమెంట్లు అయ్యాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికి 6.12 లక్షలకే పరిమితమైంది. సగానికి పడిపోయింది. రానున్న ఈ రెండున్నర నెలల్లో ఏ మేరకు భూముల క్రయ విక్రయాలు జరుగుతాయో వేచి చూడాలి.

రిజిస్ట్రేషన్లతో ఆదాయ వివరాలు(2019-20)

నెల డాక్యుమెంట్లు(లక్షల్లో) రెవెన్యూ(రూ.కోట్లల్లో)
ఏప్రిల్ 1.33 524.95
మే 1.48 690.64
జూన్ 1.38 597.2
జూలై 1.63 574.68
ఆగస్టు 1.49 649.37
సెప్టెంబరు 1.36 498.19
అక్టోబరు 1.29 548.96
నవంబరు 1.25 570.93
డిసెంబరు 1.45 577.08
జనవరి 1.24 554.16
ఫిబ్రవరి 1.53 721.57
మార్చి 1.16 551.29
మొత్తం 16.59 7061.03

రిజిస్ట్రేషన్లతో ఆదాయ వివరాలు(2020-21)

నెల డాక్యుమెంట్లు(లక్షల్లో) రెవెన్యూ(రూ.కోట్లల్లో)
ఏప్రిల్ 0.04 21.01
మే 0.76 193.92
జూన్ 1.41 457.1
జూలై 1.32 440.59
ఆగస్టు 1.08 455.77
సెప్టెంబరు 0.25 137.86
అక్టోబరు 0 36.88
నవంబరు 0.37 88.39
డిసెంబరు 0.89 583.44
జనవరి 0.06(4వ తేదీ) 134.15
మొత్తం 6.18 2549.11
Tags:    

Similar News