దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అద్భుతం.. కోట్ల రూపాయలతో ధనలక్ష్మి అవతారం

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: తెలంగాణ రాష్ట్రంలోనే భారీ డబ్బు నోట్లతో వాసవి మాతను ధన లక్ష్మిదేవిగా అలంకరించిన ఘనతను మహబూబ్‎నగర్ బ్రాహ్మణవాడి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు సాధించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు అమ్మవారిని పలు రూపాలలో అలంకరిస్తూ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని 4కోట్ల, 44 లక్షల, 44 వేల, 444రూపాయల, 44 పైసలతో ధనలక్ష్మి రూపాన్ని అలంకరించారు. […]

Update: 2021-10-10 08:48 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్‎నగర్: తెలంగాణ రాష్ట్రంలోనే భారీ డబ్బు నోట్లతో వాసవి మాతను ధన లక్ష్మిదేవిగా అలంకరించిన ఘనతను మహబూబ్‎నగర్ బ్రాహ్మణవాడి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ సభ్యులు సాధించారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు అమ్మవారిని పలు రూపాలలో అలంకరిస్తూ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా ఆదివారం ఆలయ కమిటీ సభ్యులు అమ్మవారిని 4కోట్ల, 44 లక్షల, 44 వేల, 444రూపాయల, 44 పైసలతో ధనలక్ష్మి రూపాన్ని అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం వీధులలో వందలాది మంది భక్తులతో పల్లకీ సేవ చేశారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ సభ్యులు మంత్రిని ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

Tags:    

Similar News