కర్ఫ్యూ అమలుపై డీజీపీ సమావేశం

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని అమలు చేసేందుకు పోలీసు శాఖ సమాయత్తం సిద్దమైంది. నేటి నుంచి ఈ నెలాఖరు 30వ తేదీ వరకూ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పకడ్భందీగా అమలు చేసేందుకు జిల్లా ఎస్పీలు, నగర కమిషనర్లు, ఇతర సీనియర్ పోలీస్ అధికారులతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి […]

Update: 2021-04-20 07:40 GMT

దిశ, క్రైమ్ బ్యూరో : రాష్ట్రంలో కరోనాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని అమలు చేసేందుకు పోలీసు శాఖ సమాయత్తం సిద్దమైంది. నేటి నుంచి ఈ నెలాఖరు 30వ తేదీ వరకూ రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పకడ్భందీగా అమలు చేసేందుకు జిల్లా ఎస్పీలు, నగర కమిషనర్లు, ఇతర సీనియర్ పోలీస్ అధికారులతో మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ డీజీపీ మహేందర్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఒక్కరోజే 5900 పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో కరోనా తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కరోనా కట్టడిలో భాగంగా ప్రజలు మాస్కులు ధరించడం, మాస్కులు ధరించని వారికి రూ.1000లు జరిమానా విధించడం, భౌతిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలతో పాటు కరోనా నిబంధనలు కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాత్రి 8 గంటలకే బార్లు, వైన్స్ దుకాణాలు, పబ్బులు, హోటళ్లు, సినిమా హాళ్లు, మాల్స్‌తో పాటు అన్ని రకాల వ్యాపార సముదాయాలను బంద్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడికి అక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి రాత్రి కర్ఫ్యూ నిబంధనలను అమలు చేయాలని అన్నారు. రాత్రి 9 గంటల తర్వాత ప్రజలెవరూ రోడ్లపైకి సంచరించకుండా చూడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

Tags:    

Similar News