సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే కఠిన చర్యలు

దిశ, క్రైమ్‌బ్యూరో: సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. బెంగళూరు నగరంలో సోషల్ మీడియా పోస్టు సంఘటన నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సమాజంలో ప్రజల శాంతి భద్రతలకు ప్రతికూలంగా సోషల్ మీడియాలో దురుద్దేశమైన సందేశాలను పోస్టు చేయవద్దని అభ్యర్థించారు. ఈ తరహా విషయాలపై వస్తున్న పోస్టులపై పోలీసులు నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని […]

Update: 2020-08-12 10:22 GMT

దిశ, క్రైమ్‌బ్యూరో: సోషల్ మీడియా వేదికగా అనుచిత పోస్టులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ మహేందర్‌రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. బెంగళూరు నగరంలో సోషల్ మీడియా పోస్టు సంఘటన నేపథ్యంలో డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం పత్రికా ప్రకటనను విడుదల చేశారు. సమాజంలో ప్రజల శాంతి భద్రతలకు ప్రతికూలంగా సోషల్ మీడియాలో దురుద్దేశమైన సందేశాలను పోస్టు చేయవద్దని అభ్యర్థించారు. ఈ తరహా విషయాలపై వస్తున్న పోస్టులపై పోలీసులు నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని స్టేషన్ హౌజ్ ఆఫీసర్లు, సీనియర్ ఆఫీసర్లు ప్రతి సందర్భంలోనూ నిర్దిష్టమైన కేసులను నమోదు చేయాలని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భద్రత ప్రమాణాలను అత్యున్నతంగా నిర్వహించడానికి ప్రజలు పోలీసులతో భాగస్వామ్యం కావాలని డీజీపీ పేర్కొన్నారు.

Tags:    

Similar News