ఏసీపీని సస్పెండ్ చేసిన డీజీపీ సవాంగ్
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సెంట్రల్ ఏసీపీ నాగరాజారెడ్డిని డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెండ్ చేశారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో డీజీపీ చర్యలు తీసుకున్నారు. పటమటలోని సచ్చిదానంద ఆశ్రమ వీధిలో ఓ భవన యజమానిని బెదిరించి ఏసిపి నాగరాజారెడ్డి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితులు ఏసీపీ బెదిరింపుల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విజయవాడ పోలీసు కమిషనర్ విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమేనని రుజువు కావడంతో నాగరాజారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ చర్యలు తీసుకున్నారు. అవినీతికి […]
దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సెంట్రల్ ఏసీపీ నాగరాజారెడ్డిని డీజీపీ గౌతమ్ సవాంగ్ సస్పెండ్ చేశారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావడంతో డీజీపీ చర్యలు తీసుకున్నారు. పటమటలోని సచ్చిదానంద ఆశ్రమ వీధిలో ఓ భవన యజమానిని బెదిరించి ఏసిపి నాగరాజారెడ్డి డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
బాధితులు ఏసీపీ బెదిరింపుల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విజయవాడ పోలీసు కమిషనర్ విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమేనని రుజువు కావడంతో నాగరాజారెడ్డిని సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ చర్యలు తీసుకున్నారు. అవినీతికి పాల్పడితే ఎవరికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు.