దానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ రెడీ.. అధికార పార్టీ MLA కీలక వ్యాఖ్యలు

విశాఖ పట్టణంలోని ఫిల్మ్ క్లబ్‌ను ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao), విష్ణుకుమార్(Vishnu Kumar) సందర్శించారు.

Update: 2025-04-12 11:28 GMT
దానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ రెడీ.. అధికార పార్టీ  MLA కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: విశాఖ పట్టణంలోని ఫిల్మ్ క్లబ్‌ను ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao), విష్ణుకుమార్(Vishnu Kumar) సందర్శించారు. ఈ సందర్భంగా మారు మీడియాతో మాట్లాడారు. సినీ పెద్దలు విశాఖ రావడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇక్కడ స్టూడియోలు నిర్మించాలని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో పాటు ప్రముఖ నిర్మాత అల్లు అర్వింద్(Allu Aravind) కూడా ఆలోచిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా విశాఖను ఫిల్మ్ హబ్‌గా మార్చేందుకు కసరత్తు ప్రారంభించిందని అన్నారు. అంతేకాదు.. విశాఖ ఫిల్మ్ క్లబ్ ప్రక్షాళన జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.


2015లో విశాఖపట్నంలో ఫిల్మ్ క్లబ్(Vizag Film Club) ఏర్పాటు చేశామని అన్నారు. ఫిలిం ఇండస్ట్రీ వైజాగ్ వచ్చే విధంగా అప్పట్లో చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత ఫిల్మ్‌క్లబ్‌ ఏర్పాటు ప్రక్రియ మారిపోయి, పొలిటికల్ క్లబ్ కింద మార్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. మంచి ఉద్దేశ్యంతో ప్రారంభించిన వైజాగ్ ఫిల్మ్‌క్లబ్‌ దారి తప్పిందని అన్నారు. ప్రక్షాళనతో పాటు ఫిల్మ్‌క్లబ్‌కు భూకేటాయింపు చేసి భవనాన్ని కూడా నిర్మించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అందరూ వైజాగ్‌కు ఫిలిం పరిశ్రమ రావాలని కోరుకుంటున్నారని తెలిపారు.

Tags:    

Similar News