ఆయన స్టేట్మెంట్ చిన్న వ్యాఖ్య కాదు.. అందుకే అంతలా రియాక్షన్ : డీజీపీ గౌతం సవాంగ్

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. ఈ అలజడికి పట్టాభి వ్యాఖ్యలే కారణమని స్పష్టం చేశారు. పట్టాభి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చిన్న వ్యాఖ్య కాదని వ్యాఖ్యానించారు. ఒక రాజ్యాంగ సంస్థపై, ఒక ముఖ్యమంత్రిపై అలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. ఆ వ్యాఖ్యలకు వచ్చిన రియాక్షన్ మనం చూశాం. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ఇకపోతే టీడీపీ కార్యాలయాలు, […]

Update: 2021-10-20 04:55 GMT

దిశ, ఏపీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. ఈ అలజడికి పట్టాభి వ్యాఖ్యలే కారణమని స్పష్టం చేశారు. పట్టాభి ఇచ్చిన స్టేట్మెంట్ ఏమి చిన్న వ్యాఖ్య కాదని వ్యాఖ్యానించారు. ఒక రాజ్యాంగ సంస్థపై, ఒక ముఖ్యమంత్రిపై అలాంటి అభ్యంతకర వ్యాఖ్యలు చేయకూడదని హితవు పలికారు. ఆ వ్యాఖ్యలకు వచ్చిన రియాక్షన్ మనం చూశాం. భవిష్యత్‌లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. ఇకపోతే టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడులకు సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం అందలేదన్నారు. పట్టాభి నోరు జారి ఆ వ్యాఖ్యలు చేసినట్లు లేదన్నారు. ఒక పార్టీ ఆఫీస్ నుంచి అలాంటి వ్యాఖ్యలు చెప్పించారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. పరేడ్‌లో బ్యాండ్ జరుగుతున్న సమయంలో తనకు మంగళవారం వాట్సప్ కాల్ వచ్చిందని వెల్లడించారు. సాయంత్రం 5.03 గంటలకు ఆ కాల్ వచ్చిందని అయితే ఆ సౌండ్స్‌లో మాట్లాడలేక పోయానని తెలిపారు. చట్ట ప్రకారం దాడికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు.

 

Tags:    

Similar News