Mokshada Ekadashi: మోక్షద ఏకాదశి ఎప్పుడు..?.. ఈ రోజున ఏం చేయాలంటే..?
మార్గశిర మాసం అంటే విష్ణుదేవుడికి ( vishnu dev) చాలా ఇష్టం.
దిశ, వెబ్ డెస్క్ : మార్గశిర మాసం అంటే విష్ణుదేవుడికి ( vishnu dev) చాలా ఇష్టం. అలాగే, ఏకాదశి తిథిని పవిత్రమైనదిగా పండితులు చెబుతుంటారు. అయితే, డిసెంబరు 11న మోక్షద ఏకాదశి ( Mokshada Ekadashi) వస్తుంది. ఈ రోజున తెల్లవారు జామున 3 గంటల నుంచి.. రాత్రి వరకు ఉంటుందని అంటున్నారు. అయితే, ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి తల స్నానంచేసి ఆ తర్వాత దీపాలు వెలిగించాలి. విష్ణుసహాస్ర నామపారాయణ, విష్ణుదేవుడి అష్టోత్తర నామావాళి చదవాలని పండితులు చెబుతున్నారు.
ఈ రోజున విష్ణువును గులాబీ పువ్వులు, తులసీ మాలలతో వేసి పూజించాలి. అలాగే నాలుగు రకాల ఫలాలను నైవేద్యంగా సమర్పించాలని అంటున్నారు. కొంతమంది, ఈ రోజు మొత్తం ఉపవాసం ఉంటారు.మోక్షద ఏకాదశి రోజున.. పేద వాళ్ళకి భోజనాన్ని పెట్టాలట. ఇలా చేయడం వలన.. తెలిసి కానీ తెలియక కానీ చేసినపాప కర్మలన్ని తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.