Venus Transit : శుక్రుడు మీనరాశిలో సంచరించడం వలన ఈ రెండు రాశుల వారికి శుభంగా ఉండనుంది!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2023 ఫిబ్రవరి 15 న శుక్రుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు.

Update: 2023-02-11 03:32 GMT

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం 2023 ఫిబ్రవరి 15 న శుక్రుడు మీనరాశిలో సంచారం చేయనున్నాడు. శుక్రుడి సంచార ప్రభావం అన్ని రాశుల పైన పడుతుంది. కానీ కొన్ని రాశులకు మాత్రమే అనుకూల ప్రభావం ఉంటుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.

మేష రాశి

మేషరాశిలోకి శుక్ర సంచారం వలన.. ఈ రాశి వారికి కలిసి రానుంది . పెట్టుబడులు పెట్టిన వారికి ఇది మంచి సమయం. మీరు పని చేసే ఆఫీసులో మీకు మంచి పేరుతో పాటు.. ప్రమోషన్ కూడా వస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.

మిథున రాశి

మిథున రాశి లోకి శుక్ర సంచారం వలన.. ఈ రాశి వారికి శుభంగా ఉండనుంది. ఒత్తిడి నుంచి బయట పడతారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి ఉద్యోగం వస్తుంది. దీంతో మీ కుటుంబ సభ్యులు సంతోష పడతారు. ఈ సమయంలో కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు.

Tags:    

Similar News