ఈ రోజు ప్రదోష వ్రతం.. వీటిని దానం చేస్తే భోళా శంకరుడి అనుగ్రహం పొందుతారు

ప్రదోష వ్రతానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Update: 2024-07-03 02:14 GMT

దిశ, ఫీచర్స్ : ప్రదోష వ్రతానికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెల కృష్ణ పక్షం, శుక్ల పక్ష త్రయోదశి తిథి రోజున ఈ ప్రదోష వ్రత వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ రోజున శివుడు కైలాస పర్వతంపై ధ్యానం చేస్తాడని నమ్ముతారు. ఆయనను ఆరాధించడం ద్వారా ప్రజలు శివుడి అనుగ్రహం పొందుతారు. ఈ రోజున వీటిని దానం చేయడం ద్వారా మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.

పంచాంగం ప్రకారం, జేష్ట మాసంలోని కృష్ణ పక్షంలో త్రయోదశి తేదీ జూలై 3 ఉదయం 7:10 గంటలకు మొదలయ్యి జూలై 4 ఉదయం 5:54 గంటలకు ముగుస్తుంది. అందువల్ల ఈ ప్రదోష వ్రత వ్రతాన్ని జూలై 3వ తేదీ బుధవారం నాడు ఆచరిస్తారు. బుధ ప్రదోష వ్రతం రోజున శివునికి ప్రత్యేల పూజలు చేస్తారు.

ప్రదోష వ్రతం రోజున మూడు రకాల ఫలాలను దానం చేయడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే జాతకంలో దోషాలున్నా కూడా తొలగిపోతాయి. నల్ల నువ్వులు శివునికి అత్యంత విలువైనవి. ప్రదోష వ్రతం రోజున నల్ల నువ్వులను దానం చేస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. వస్త్ర దానం చేయడం, పుణ్య కార్యమని జ్యోతిష్యులు కూడా చెబుతున్నారు. ప్రదోష వ్రతం రోజున పేదలకు కొత్త వస్త్రాలు దానం చేయడం ద్వారా శివుడు సంతోషిస్తాడు. మీ జీవితంలో కష్టాలన్ని తీర్చి ఆనందాన్ని ఇస్తాడు.


Similar News