శ్రీరామనవమి రోజు ఈ పనులు చేస్తే.. కష్టాలన్నీ పోతాయంట!
శ్రీరామనవమి ఏప్రిల్ 17న జరగనున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అయితే ఈ రోజు ఈ పరిహారాలు పాటించడం వలన జీవితంలోని కష్టాలన్నీ
దిశ, ఫీచర్స్ : శ్రీరామనవమి ఏప్రిల్ 17న జరగనున్న విషయం తెలిసిందే. అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుంది. అయితే ఈ రోజు ఈ పరిహారాలు పాటించడం వలన జీవితంలోని కష్టాలన్నీ మటుమాయం అయిపోతాయంట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
శ్రీరామనవమి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరించడం వలన చాలా మంచి జరుగుతుందంట. అంతే కాకుండా, చక్కెరతో చేసిన11 బతషాలు, కరివేపాకులు,11 లవంగాలను శ్రీరాముడికి సమర్పించాలంట. దీని వలన ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోయి ఆనందంగా ఉంటారు. అదే విధంగా ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని 108 సార్లు శ్రీరామ రక్ష మంత్రాన్ని జపించి ఆ నీటిని ఇల్లు మొత్తం చల్లడం వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అదే విధంగా, రామాలయంలో నెయ్యి లేదా నూనె దీపం వెలిగించి జై శ్రీరామ్ అనే పదాన్ని 108 సార్లు జపించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే, భార్య భర్తల మధ్య నిత్యం గొడవలు ఉన్నట్లైతే అలాంటి వారు సీతారాములకు పసుపు, కుంకుమ, గంధం సమర్పించి, ఓం జై సీతారాం అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వలన వివాహ బంధంలో సమస్యలన్నీ తొలగిపోతాయి.