తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. దర్శనానికి ఎంత సమయమంటే..?
కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
దిశ, వెబ్డెస్క్: కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు 10 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు కల్పించే సర్వదర్శనానికి 16 గంటలు క్యూ లైన్లో ఉండాల్సి వస్తుంది. నిన్న శ్రీవారిని 64, 754 మంది దర్శించుకోగా.. 24,144 మంది తలనీలాలు సమర్పించారు. ఈ మేరకు భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.76 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.