రుచికరమైన ప్రసాదం లభించే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..
మన దేశంలో భగవంతుని పై విశ్వాసంతో పాటు ప్రసాదానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది.
దిశ, ఫీచర్స్ : మన దేశంలో భగవంతుని పై విశ్వాసంతో పాటు ప్రసాదానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. దేశంలోని కొన్ని దేవాలయాల్లో ప్రతిరోజూ వందల కిలోల ప్రసాదాన్ని వడ్డిస్తారు. ఒక ఆలయంలో 56 భోగ్‌లు వడ్డించే సంప్రదాయం ఉంది. ఆ ప్రసాదాన్ని భక్తులకు కూడా పంపిణీ చేస్తారు. ఈ దేవాలయాల ప్రసాదం ఎంతో రుచికరంగా ఉంటుంది. ప్రజలు తమదేవుడి పై భక్తితో పాటు ప్రసాదం పట్ల అభిమానంగా మారతారు.
పూరిజగన్నాథ దేవాలయం, మహాప్రసాదం..
హిందూ మతంలో ఒరిస్సాలో ఉన్న జగన్నాథ దేవాలయం నాలుగు ధాములలో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ ఉన్న జగన్నాథునికి మహాప్రసాదం అందిస్తారు. దీనిని 56 భోగ్ అంటారు. 56 రకాల ఆహార పదార్థాలను సేకరించి ఒక మట్టి కుండలో చెక్క పై ఈ మహాప్రసాదాన్ని తయారుచేస్తారు. ఈ మహాప్రసాదాన్ని స్వీకరించడం మహాభాగ్యమని చెబుతారు. ఎంతమంది వచ్చినా ఈ ప్రసాదానికి లోటుండదని ఈ మహాప్రసాదాన్ని కూడా దైవంగా భావిస్తారని విశ్వసిస్తారు. ఈ మహాప్రసాదం తినడానికి ఎంత రుచిగా ఉంటుందో అంతే దివ్యమైనది.
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం..
భారతదేశంలోని పురాతన దేవాలయాలలో తిరుమల ఆలయం దేశంలోని అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటిగా పరిగణిస్తారు. దీనితో పాటు ఈ ఆలయం ప్రసాదంగా లభించే లడ్డూలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలోని వంటగదిలో ప్రతిరోజూ లక్షలాది మందికి వివిధ రకాల దక్షిణ భారతీయ వంటకాలు తయారు చేస్తారు. ఆలయ వంటగది సౌరశక్తితో పనిచేస్తుంది. ఇక్కడ ప్రతిరోజూ సుమారు 1100 మంది వంటవారు ఆహారాన్ని తయారు చేసి ప్రసాదంగా పంపిణీ చేస్తారు.
కోయంబత్తూరులోని మురుగన్ దేవాలయం పంచామృతం..
అరుల్మిగు దండాయుధపాణి స్వామి ఆలయం తమిళనాడులోని కోయంబత్తూరుకు ఆగ్నేయంగా 150 కిలోమీటర్ల దూరంలో పళనిలో ఉంది. ఈ ఆలయంలో అరటిపండ్లు, ఆవు నెయ్యి, బెల్లం, తేనె, యాలకుల నుండి ప్రసాదం తయారు చేస్తారు. కొన్నిసార్లు ఖర్జూరం, చక్కెరను కూడా కలుపుతారు.
షిర్డీ సాయిబాబా మందిర్ ప్రసాదాలు..
షిర్డీ సాయిబాబా ఆలయానికి ఆనుకుని ఉన్న భారీ వంటగదిలో రోజూ దాదాపు 2000 కిలోల పప్పులు, బియ్యంతో పాటు ఇతర కూరగాయలతో వంటలు తయారు చేస్తారు. ఇది భారతదేశంలోనే అత్యంత ధనిక తీర్థయాత్ర కేంద్రంగా మాత్రమే కాకుండా రుచికరమైన ప్రసాదం లడ్డు, రసోయి ప్రసాదాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఈ వంటగదిలో దాదాపు 1100 మంది కుక్‌లు పనిచేస్తున్నారు. ఇక్కడ ఉన్న వంటగది ఆసియాలోనే అతిపెద్ద సౌరశక్తితో పనిచేసే వంటగది.
లంగర్ ఆఫ్ గోల్డెన్ టెంపుల్, అమృత్‌సర్..
అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌లోని లంగర్‌లో, ప్రతిరోజూ చాలా ప్రసాదం, అన్నం, పప్పు, రోటీ, కూరగాయలు తయారు చేస్తారు.