ఆరు నెలలు ఈ రాశుల వారు జాగ్రత్త.. ఏది మాట్లాడినా కష్టమే!
రాబోయే ఆరు నెలలు ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు పండితులు. శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి తిరోగమనం చేయడం వలన కొన్ని రాశుల వారికి బాగుంటే, మరి
దిశ, ఫీచర్స్ : రాబోయే ఆరు నెలలు ఈ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు పండితులు. శని గ్రహం తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి తిరోగమనం చేయడం వలన కొన్ని రాశుల వారికి బాగుంటే, మరి కొన్ని రాశుల వారికి సమస్యలు తలెత్తుతాయంట. మఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి ఆరు నెలలపాటు జూన్ 29 నుంచి నవంబర్ 15 వరకు ఇబ్బందులు రావచ్చు అంటున్నారు జ్యోతిష్యులు. కాగా ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.
1. మేషరాశి : ఈ రాశివారికి శని తిరోగమనం వలన చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయంట. అనవసర ఖర్చులు పెరిగిపోతాయంటున్నారు పండితులు. అలాగే ఉద్యోగం చేస్తున్న ఈ రాశుల వారికి జాబ్ కూడా పోయే ఛాన్స్ ఉన్నదంట.
2. వృషభ రాశి : ఈ రాశి వారికి శని తిరోగమనం వలన చాలా నష్టాలు సంభవిస్తాయి. ఏ పని చేసినా అది మధ్యలోనే ఆగిపోతుంది. అంతే కాకుండా వీరు ఏది మాట్లాడినే అది తప్పే అవుతుంది. కుటుంబంలో కూడా చాలా సమస్యలు పెరిగిపోతాయి.
3.తుల రాశి : వారు ఈ ఆరు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా నష్టపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంది. దురాశకు పోతే ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. మీరు ఎవరికి అప్పు ఇచ్చినా అది తిరిగి రావడం చాలా కష్టం.
4. కుంభ రాశి : శని తిరోగమనం వలన ఈ రాశి వారికి రుణభారం అధికం అవుతోంది. ఆర్థిక సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. చాలా సమస్యలు ఎదురువుతాయి. నవంబర్ వరకు మీరు వాగ్వాదాల్లో తల దూర్చకపోవడమే మంచిది. ఒక వేళ మీరు ఏదైనా మాట్లాడితే అది మీకు సమస్యలను సృష్టిస్తుంది.
(నోట్ : ఇది ఇంటర్నెట్లో ఇచ్చిన సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది. దిశ, దీనిని ధృవీకరించలేదు. ఇది వారి వారి నమ్మకాలపైన ఆధారపడి ఉంటుంది)