హోలీ పండగ రోజు ఈ వస్తువులను అసలు దానం చేయకండి.. ఎందుకంటే?

ఈ రోజున ఈ వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం, సంపద, డబ్బు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి

Update: 2024-03-20 04:07 GMT

దిశ, ఫీచర్స్: హోలీ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, ఈ పండుగను చిన్న వాళ్ల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ ఎంతో ఆనందంగా జరుపుకుంటారు. తెలంగాణలో ఈ పండుగ ఏడు రోజుల ముందుగానే ప్రారంభమవుతుంది. ఈ హోలీ పండుగను ప్రతి ఏడాది పాల్గుణ మాసంలో పౌర్ణమి తర్వాత రోజు జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో హోలీ పండుగ ముందు రోజు కాముడు దహనం చేసి హోలీని జరుపుకుంటారు. పురాణాల ప్రకారం ఈ పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున ఈ వస్తువులను దానం చేయడం వల్ల జీవితంలో సంతోషం, సంపద, డబ్బు దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఆ వస్తువులు ఏంటో ఇక్కడ చూద్దాం..

ఈ రోజున వివాహిత స్త్రీలు హోలీ పండుగ రోజున ఎలాంటి నగలను దానం చేయకూడదు. ముఖ్యంగా ఈ రోజున స్త్రీలకు బొట్టు బిళ్ళలు పెర్ఫ్యూమ్, పౌడర్ వంటి వస్తువులు ఇవ్వకూడదని నిపుణులు అంటున్నారు. డబ్బును ఎవరికి ఇవ్వకండి. ఇది మీ ఆర్థిక పరిస్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

హోలీ రోజున వస్త్రదానం చేస్తే అశుభం కలుగుతుందని పూర్వీకుల నమ్మకం. ఇలా దానం చేయడం వల్ల ఇంట్లో దరిద్రం మొదలవుతుందని పురాణాల్లో తెలిపారు. అంతే కాకుండా, కుటుంబంలో భయాలు వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలను కలిగిస్తాయి. స్టీల్ వస్తువులను దానం చేయడం మంచిది కాదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

Read More..

కుంభరాశిలో మూడు గ్రహాలు కలయిక.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు  


Similar News