అక్షయ తృతీయ రోజు బంగారం, వెండే కాకుండా.. వీటిని కొంటే ధనవంతులవ్వడం ఖాయం

హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Update: 2024-04-28 05:39 GMT

దిశ, ఫీచర్స్: హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు చేయడం చాలా శుభప్రదమని చెబుతున్నారు. దీపావళి, ధన త్రయోదశి వలె, అక్షయ తృతీయ కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10వ తేదీన వస్తుంది. చాలా మంది లక్ష్మీదేవిని పూజిస్తూ పేదలకు అన్నదానం చేస్తుంటారు.అయితే, అక్షయ తృతీయ తృతీయ రోజు బంగారం, వెండి కంటే ఈ వస్తువులు కొనడం మంచిదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

మే 10వ తేదీ 10:54 వరకు రోహిణి నక్షత్రం ఉంది. మీరు, మీ ఇంటికి కావలసిన వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే, రోహిణి నక్షత్రంలో వెళ్లండి. జ్యోతిష్య శాస్త్రంలో ఈ సమయం శుభప్రదమని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అక్షయ తృతీయ రోజున వెండి, బంగారమే కాకుండా భూమి, ఇల్లు, వాహనం వంటి వాటిని కూడా కొనుగోలు చేయవచ్చు. ఈ రోజున షాపింగ్ చేయడం వల్ల శుభం కలుగుతుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అదనంగా, డబ్బు ఆకర్షణ పెరుగుతుంది.

ఈ రోజున మీకు అవసరం ఉన్నా లేకపోయినా మీ శక్తి కొలది ఇంట్లోకి వస్తువులను కొనుగోలు చేయవచ్చు. ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. పేదలకు భోజనం పెట్టడం కూడా చాలా మంచిది.


Similar News