జూన్8న మృగశిర ప్రారంభం.. ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

జూన్ 8న సూర్యుడు రోహిణి నక్షత్రాన్ని వీడి మృగశిర నక్షత్రంలోకి మారబోతున్నాడు. దీంతో రోహిణి కార్తె ముగిసిపోతుంది. ఇక ఈరోజు నుంచి ఎండలు తగ్గిపోయి, చిరు జల్లులు మొదలు అవుతుంటాయి. ఇక ఈ మృగశిర ప్రారంభం

Update: 2024-06-05 05:19 GMT

దిశ, ఫీచర్స్ : జూన్ 8న సూర్యుడు రోహిణి నక్షత్రాన్ని వీడి మృగశిర నక్షత్రంలోకి మారబోతున్నాడు. దీంతో రోహిణి కార్తె ముగిసిపోతుంది. ఇక ఈరోజు నుంచి ఎండలు తగ్గిపోయి, చిరు జల్లులు మొదలు అవుతుంటాయి. ఇక ఈ మృగశిర ప్రారంభం అవ్వడంతో కొన్ని రాశుల వారికి అదృష్టం పట్టనుందంట. ఆ రాశులు ఏవో చూసేద్దాం.

మేష రాశి : ఈ రాశి వారికి సూర్యుడు మృగశిర నక్షత్రానికి వెళ్లగానే అదృష్టం కలిసి వస్తుంది. దీని వలన వీరికి ఆర్థికంగా కలిసి వచ్చే ఛాన్స్ ఉంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం మీ సొంతం అవుతుంది. ఈ రోజుల్లో మీరు ఏ వ్యాపారం మొదలు పెట్టిన అత్యధిక లాభాలను పొందుతారు.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి సూర్యుడి మార్పు వలన వైవాహిక జీవితంలోని సమస్యలు తొలిగిపోతాయి. సంపద పెరుగుతుంది. కోర్టు వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది.

తుల రాశి : మృగశిర నక్షత్రంలోకి సూర్యుడు వెళ్లడం వలన ఈ రాశి వారు అత్యధిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం వెళ్లివిరుస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగం పొందే ఛాన్స్, విద్యార్థులకు అనుకు కాలేజీలో సీటు పొందే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఉన్నతాధికారుల కూడా మీరు చేసే పని తెలుసుకొని మిమ్మల్ని ప్రశంసిస్తారు.

కుంభ రాశి :ఈ రాశి వారికి మృగశిర నక్షత్రంలోకి సూరర్యుడు ప్రవేశించడం వలన కలిసి వస్తుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. దాంపత్య జీవితం బాగుంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.


Similar News