హోలీ నాడే చంద్రగ్రహణం.. ఈ రోజున ఈ వస్తువులు దానం చేస్తే మంచిదట..

హిందూ మతంలో, దేశ విదేశాలలో ప్రతి సంవత్సరం హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు.

Update: 2024-03-22 08:00 GMT

దిశ, ఫీచర్స్ : హిందూ మతంలో, దేశ విదేశాలలో ప్రతి సంవత్సరం హోలీ పండుగను ఘనంగా జరుపుకుంటారు. రంగులతో హోలీ ఆడటానికి ఒక రోజు ముందు హోలికా దహనం జరుగుతుంది. ఈ సంవత్సరం మార్చి 24న హోలికా దహనాన్ని చేయనున్నారు. మరుసటి రోజు అంటే మార్చి 25న రంగులతో హోలీ ఆడనున్నారు. హోలీ పండుగ నాడు విరాళం ఇవ్వడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల సుఖ సంతోషాలు కలుగుతాయని చెబుతారు. అయితే ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కూడా హోలీ నాడు రాబోతుంది. హిందూ మతం ప్రకారం, చంద్రగ్రహణం రోజున, ఉదయం నదిలో స్నానం చేసిన తర్వాత దానధర్మాలు చేయాలని చెబుతారు. కానీ, హోలీ రోజున ఏర్పడే ఈ చంద్రగ్రహణం సందర్భంగా దానాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హోలీ రోజున ఏయే వస్తువులు దానం చేయాలో, ఏ వస్తువులను దానం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ వస్తువులను దానం చేయవచ్చు..

హోలికను పూజించిన తర్వాత లేదా చంద్రగ్రహణం తర్వాత మీరు ప్రత్యేకంగా వంటకాలు, ధాన్యాలు, ఎవరికైనా తినిపించడం, పండ్లు, స్వీట్లు మొదలైన వాటిని దానం చేయవచ్చు. హోలీ రోజున ఈ వస్తువులను దానం చేయడం వల్ల మనిషి జీవితంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి.

దానం చేయకూడని వస్తువులు..

హోలీ రోజున బట్టలు దానం చేయవద్దు..

కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, హోలికా దహన్, హోలీ రోజున బట్టలు దానం చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. ఈ రోజుల్లో బట్టలు దానం చేయడం వల్ల ఇంటి నుండి ఆనందం, శ్రేయస్సు దూరం అవుతుందని. వ్యక్తి ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవలసి వస్తుందని చెబుతారు.

డబ్బు దానం చేయవద్దు..

హోలికా దహన్, హోలీ రోజున డబ్బును దానం చేయకూడదని చెబుతుంటారు. ఈ రోజున డబ్బును విరాళంగా ఇవ్వడం వల్ల వ్యక్తి ఆర్థిక పరిస్థితి పై ప్రతికూల ప్రభావం పడుతుంది. అలాగే, హోలీ రోజున డబ్బును దానం చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అలాగే హోలీ రోజున బంగారు ఆభరణాలు దానం చేయకూడదు.

ఆవనూనె దానం చేయవద్దు..

హోలికా రోజున ఆవాల నూనెను దానం చేయడం వల్ల శనిదేవుని కోపానికి గురి అవుతారని చెబుతారు. అందుకే పొరపాటున కూడా ఈ రోజున ఆవనూనె దానం చేయకండి.

గాజు వస్తువులను దానం చేయకూడదు..

హోలీ రోజున గాజు వస్తువులు దానం చేయకూడదని పండితులు చెబుతున్నారు. గాజుతో చేసిన వస్తువులను దానం చేయడం వల్ల ఇంట్లో సమస్యలు వచ్చి కలహాలు ఏర్పడతాయని చెబుతున్నారు.

తెల్లని వస్తువులను దానం చేయవద్దు..

హోలీ రోజున పాలు, పెరుగు, పంచదార వంటి తెల్లని వస్తువులను దానం చేయడం మానుకోవాలి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రోజున తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల జాతకంలో శుక్రుడి స్థానం బలహీనపడుతుందట. దీని కారణంగా వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని పండితులు చెబుతున్నారు.

స్త్రీ అలంకరణ వస్తువులు..

వివాహిత స్త్రీలు తమ 16 అలంకరణ వస్తువులను దానం చేయకూడదని చెబుతున్నారు పండితులు. అలా దానం చేస్తే అశుభ ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. హోలీ రోజున కుంకుమ, గాజులు, పూలు, వంటి ఇతర వస్తువులను దానం చేయడం మానుకోండి.


Tags:    

Similar News