మార్చి 14 నుంచి ఖర్మ సమయం మొదలు.. మరో నెల రోజుల వరకు శుభకార్యాలకు చెక్

హిందూ క్యాలెండర్ ప్రకారం మార్చి 14, 2024న సూర్యభగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు.

Update: 2024-03-14 08:54 GMT

దిశ, ఫీచర్స్ : హిందూ క్యాలెండర్ ప్రకారం మార్చి 14, 2024న సూర్యభగవానుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆ తర్వాత ఖర్మ సమయం ప్రారంభమవుతాయి. ఖర్మాలు మార్చి 14 నుండి ప్రారంభమై ఏప్రిల్ 13 వరకు ఉండనున్నాయి. ఖర్మ సమయంలో వివాహం, గృహ ప్రవేశం, ఆస్తులు కొనడం, కొత్త భవన నిర్మాణం, పిల్లలకు క్షవరం చేయడం, ఇలాంటి శుభకార్యాలు చేయడం నిషేధం అంటున్నారు పండితులు.

ఖర్మ సమయంలో వివాహానికి సంబంధించిన ఏ పనిని కూడా చేయకూడదని పండితులు చెబుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పెళ్లి కోసం సంబంధాలు చూస్తూ ఉంటే ఈ ఖర్మలు గడిచే వరకు వేచి ఉండాల్సిందే అంటున్నారు. సాధారణంగా కుటుంబాలు ఏర్పాటు చేసుకున్న వివాహాలు మాత్రమే ఖర్మలో నిషిద్ధమని నమ్ముతారు. ప్రేమ వివాహం అయితే వివాహం చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఈ కాలంలో కొత్త పనులేవీ ప్రారంభించకూడదు. ఇప్పటికే కొన్ని పనులు జరుగుతున్నట్లయితే దానిని కొనసాగించడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.

ఖర్మ సమయంలో ప్రతిరోజూ సూర్య భగవానుడికి నీటిని సమర్పించాలి. ఏదైనా ఆలయానికి వెళ్లి ప్రార్థన చేయడం, క్రమం తప్పకుండా "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపించాలి. అధిక బంగారాన్ని ధరించవద్దని పండితులు చెబుతున్నారు. ఖర్మ సమయంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవడం, మద్యపానం, మాంసాహారం వంటివాటిని ఈ రోజుల్లో నిషేధించాలని చెబుతున్నారు.

Tags:    

Similar News