కలలో గోవు ఈ 5 విధాలుగా కనిపిస్తే శుభమా.. అశుభమా

మన నిత్య జీవితంలో మనం పడుకున్న సమయంలో ఎన్నో కలలు కంటూ ఉంటాం..

Update: 2024-01-12 11:25 GMT

దిశ, ఫీచర్స్ : మన నిత్య జీవితంలో మనం పడుకున్న సమయంలో ఎన్నో కలలు కంటూ ఉంటాం.. అయితే వాటిలో కొన్ని కొలలు మంచి శకునం, మరికొన్ని కలలు మనల్ని భయపెడతాయి. కొన్నిసార్లు కలలు మన భవిష్యత్తును కూడా సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఈ శాస్త్రంలో ప్రతికల వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం దాగి ఉంటుంది. మీ కలలో ఆవును చూడటం అంటే మీరు మీ అన్ని పనులలో త్వరలో విజయం సాధిస్తారని అర్థం.

ఆవును హిందూ మతంలో గోమాతగా, లక్ష్మీదేవి స్వరూపంటా పరిగణిస్తారు. ఒక గోవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే జంతువులలో ఆవు అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఇలాంటి ఆవు కలలో కనిపిస్తే ఎలాంటి శుభాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

కలలో ఆవును చూడటం

స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో ఆవును చూడటం మంచి సంకేతం. రాబోయే కాలంలో మీరు ఆనందాన్ని పొందబోతున్నారని అర్థం. సమాజంలో మీ కుటుంబ గౌరవం పెరుగుతుందని, వ్యాపారంలో పురోగతి ఉంటుందని చెబుతుంది.

కలలో ఆవు దూడను చూడటం

కలలో దూడ కనిపిస్తే ఎంతో మంచిదట. అంటే రాబోయే రోజుల్లో మీరు ఆర్థికంగా లాభపడే అవకాశం ఉందని స్వప్న శాస్త్రం చెబుతుంది. మీరు ఏపనిని తలపెట్టినా విజయం సాధిస్తారని ఈ కలచెబుతుంది.

కలలో ఆవుకి రొట్టెలు తినిపించడం  

మీరు మీ కలలో ఆవుకు రొట్టె తినిపించడం చూస్తే ఎంతో మేలు జరుగుతుందట. సైన్స్ ప్రకారం, ఈ కల మీ దీర్ఘాయువును సూచిస్తుంది. మీ ఆరోగ్యం లేదా మీ కుటుంబంలో ఎవరికైనా చాలా కాలంగా ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే, అది త్వరలోనే మెరుగుపడుతుందట.

కలలో మందలో ఉన్న ఆవులను చూడటం

మీ కలలో ఆవుల మందను చూడటం అంటే త్వరలో మీకు చాలా డబ్బు వస్తుందిని స్వప్న శాస్త్రం చెబుతుంది. అలాగే మీ వ్యాపారం పురోగమిస్తుంది. సైన్స్ ప్రకారం, ఈ కల మీరు త్వరలో ధనవంతులు అవుతారని సూచిస్తుంది.

కలలో చనిపోయిన ఆవును చూడటం

మీ కలలో ఆవు చనిపోయినట్లు కనిపిస్తే అశుభంగా పరిగణిస్తారు. ఈ కల అంటే మీరు భవిష్యత్తులో కొంత నష్టాన్ని చవిచూడబోతున్నారని, మీ జీవితంలో కొన్ని పెద్ద సమస్యలు తలెత్తవచ్చని అర్థం.

Tags:    

Similar News