ఆ సరస్సు నుండి స్వర్గానికి మార్గం.. ఆ రహస్యం ఏంటో చూసేద్దామా..

మన భారతదేశం అనేక పౌరానిక కథలకు నెలవు. రామాయణం, మహాభారత కావ్యాలకు పుట్టినిల్లు మన భారతదేశం.

Update: 2024-06-24 10:10 GMT

దిశ, వెబ్‌‌‌‌డెస్క్ : మన భారతదేశం అనేక పౌరానిక కథలకు నెలవు. రామాయణం, మహాభారత కావ్యాలకు పుట్టినిల్లు మన భారతదేశం. అలాగే అనేక అంతుచిక్కని రహస్యాలు కూడా దాగి ఉన్నాయి. అలాంటి ఒక రహస్యమే సతోపంత్ సరస్సు. సతోపంత్ అంటే సత్యమార్గం. మహాభారత కాలంలో పాండవులు ఈ మార్గం ద్వారా స్వర్గానికి వెళ్లారని నమ్ముతారు. అందుకే ఈ సరస్సుకి సతోపంత్ అని పేరు వచ్చింది. అంతే కాదు పాండవులు స్వర్గానికి వెళుతున్నప్పుడు, వారు ఒక్కొక్కరుగా చనిపోతుండగా, భీముడు ఈ ప్రదేశంలోనే మరణించాడని కూడా చెబుతారు. అందుకే ఈ ప్రదేశం ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.

పాండవుల స్నానం, ధ్యానం..

పురాణాల ప్రకారం, పాండవులు స్వర్గానికి వెళ్ళే మార్గంలో ఈ ప్రదేశంలోనే స్నానం చేసి ధ్యానం చేసేవారని పురాణాలు చెబుతున్నాయి. ఆ తర్వాత వారు తమ తదుపరి ప్రయాణాన్ని ప్రారంభించేవారు. అందుకే ఇది చాలా పవిత్రమైన సరస్సుగా పరిగణిస్తారు. అంతే కాకుండా ధర్మరాజు యుధిష్ఠిరుడు స్వర్గానికి వెళ్లేందుకు దివ్య వాహనం ఇక్కడికి వచ్చిందని కథనం కూడా ఉంది.

సరస్సు ఆకారం..

చాలా సరస్సులు గుండ్రంగా, పొడుగుగా ఉండడాన్ని చూసే ఉంటాం. కానీ సతోపంత్ సరస్సు ఆకారం త్రిభుజాకారంగా ఉంటుంది. ఇక్కడ పవిత్ర ఏకాదశి సందర్భంగా, త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వేర్వేరు మూలల్లో నిలబడి స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందువల్ల దీని ఆకారం త్రిభుజాకారంగా ఉంటుందట.

స్వర్గానికి మార్గం సతోపంత్ సరస్సు..

సతోపంత్ సరస్సు నుండి కొంత దూరం నడిచాక స్వర్గరోహిణి గ్లేసియర్ కనిపిస్తుంది. దీనిని స్వర్గానికి మార్గం అని కూడా అంటారు. ఈ హిమానీనదంపైనే స్వర్గానికి మార్గంగా ఏడు మెట్లు ఉన్నాయని చెబుతారు. అయితే సాధారణంగా ఈ హిమానీనదం పై కేవలం మూడు మెట్లు మాత్రమే కనిపిస్తాయి. మిగిలినవి మంచు, పొగమంచుతో కప్పి ఉంటాయని చెబుతారు.


Similar News