గరుడ పురాణం.. మరణించే సమయంలో ఎలాంటి అనుభవాలు ఉంటాయో తెలుసా..
మరణించే సమయంలో బాధ ఉంటుందా ? మరణం తరువాత ఆ వ్యక్తి ఆత్మ ఎటు ప్రయాణిస్తుంది ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు గరుడ పురాణంలో వివరంగా ఇచ్చారని పండితులు చెబుతున్నారు.
దిశ, ఫీచర్స్ : మరణించే సమయంలో బాధ ఉంటుందా ? మరణం తరువాత ఆ వ్యక్తి ఆత్మ ఎటు ప్రయాణిస్తుంది ? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు గరుడ పురాణంలో వివరంగా ఇచ్చారని పండితులు చెబుతున్నారు. మరణించే సమయంలో ఒక వ్యక్తికి ఎలాంటి అనుభవాలు ఉంటాయి ? గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసుకుందాం..
గరుడ పురాణం : హిందూ మతంలో గరుడ పురాణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ పురాణం ప్రకారం మరణించిన వారి ఆత్మకు మోక్షాన్ని ప్రసాదించే గ్రంథంగా పరిగణిస్తారు. అందుకే ఎవరైనా చనిపోయిన తర్వాత వారి ఇంట్లో గరుడ పురాణం పారాయణం చేసే సంప్రదాయం ఉంది. ఒకప్పుడు పక్షిరాజు గరుడుడు విష్ణువును జీవి మరణించే సమయంలో, ఆ తర్వాత పరిస్థితి ఏంటని అడిగాడట.
అప్పుడు విష్ణువు పక్షిరాజు గరుడుడి సందేహాలను తీర్చాడట. గరుత్మంతుడి ప్రశ్నలన్నింటికీ వివరంగా సమాధానం చెప్పాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు ఈ సమాధానాలు గరుడ పురాణంలో తెలిపాడట.
ఈ అనుభవాలు మరణ సమయంలో కలుగుతాయా ?
గరుడపురాణం ప్రకారం, మరణ సమయంలో ఒక వ్యక్తి మంచి లేదా చెడు పనులను బట్టి శిక్షలను అనుభవిస్తాడట. చెడు పనులు చేసిన వారికి మరణం భయంకరంగా, బాధాకరంగా ఉంటుంది. సదా సత్కార్యాలు చేసిన వారికి మరణం శాంతి అనుభూతిని కలిగిస్తుంది.
మరణ సమయంలో ఒక వ్యక్తి మొత్తం జీవితం అతని ముందు ఒక్కసారి గుర్తుకు వస్తుందని అంటారు. బాల్యం నుండి చివరి క్షణాల వరకు అతని జీవితంలో జరిగిన అన్ని మంచి, చెడు సంఘటనలు అతని ముందు కనిపిస్తాయట.
చెడు పనులు చేసే వారికి ఈ అనుభవాలు కలుగుతాయా ?
గరుడ పురాణం ప్రకారం, చెడు పనులు చేసిన వ్యక్తులు తాము చేసిన చెడ్డ పనులు తమ ముందు కనిపించినప్పుడు ఆ పనుల పట్ల చాలా విచారంగా ఉంటారట. వారు సరైన జీవితాన్ని ఎందుకు గడప లేదని పశ్చాత్తాప పడతారట. వారు సరిగ్గా జీవించగలిగే మరొక అవకాశం పొందాలని, వారి వల్ల గాయపడని వారికి హృదయపూర్వకంగా క్షమాపణ చెప్పాలని వారు కోరుకుంటున్నారు.
మంచి పనులు చేసే వారికి ఈ అనుభవాలు కలుగుతాయా ?
గరుడ పురాణం ప్రకారం జీవితంలో ఎప్పుడూ మంచి పనులు చేసే వారికి మరణం ఒక కొత్త ప్రయాణం లాంటిది. వారు అపారమైన శాంతిని అనుభవిస్తారు. అతనిలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు. చివర్లో వారికి అపారమైన శాంతిని అందించే తెల్లని కాంతిని చూస్తారట. ఈ శాంతిలో అతను తన శరీరాన్ని వదిలివేస్తాడట.