మీ వ్యాపారం పై చెడు దృష్టి పడిందా.. అయితే ఇలా చేయండి..

నరదృష్టి గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం.. ఒకరి ఇంటి పైన నరదృష్టి పడితే ఆ ఇంటిలో అశాంతి, వ్యాపారంలో నష్టం వాటిల్లుతుందని నమ్ముతుంటారు.

Update: 2024-01-13 13:49 GMT

దిశ, ఫీచర్స్ : నరదృష్టి గురించి మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం.. ఒకరి ఇంటి పైన నరదృష్టి పడితే ఆ ఇంటిలో అశాంతి, వ్యాపారంలో నష్టం వాటిల్లుతుందని నమ్ముతుంటారు. దృష్టి గురించి తెలుసుకునే ముందు మన చుట్టూ అనేక రకాల శక్తులు సంచరిస్తుంటాయి. ఈ శక్తి సానుకూలంగా, ప్రతికూలంగా ఉంటాయి. మనిషి సానుకూల శక్తితో జీవించినంత కాలం సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు. కానీ ఏదైనా ప్రతికూల శక్తి ఇంట్లోకి వచ్చినప్పుడు ఇంట్లో అంతా గందరగోళంగా ఉంటుంది, దాన్నే చెడు కన్ను అంటారు. ఈ ప్రతికూల శక్తి ఒక వ్యక్తి ప్రవర్తన, ఆలోచనల నుండి ఉద్భవిస్తుందని పండితులు, జ్యోతిష్యులు చెబుతున్నారు.

ప్రతికూల శక్తి ప్రభావాన్ని కుటుంబంలో సమస్యలు, ఉద్యోగం లేదా వ్యాపారంలో నష్టాలు రావడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు చెడు కన్ను కారణంగా, పగలు, రాత్రి ఇంటిలో అపశ్రుతులు, అశాంతి నెలకొంటాయని పండితులు చెబుతున్నారు. అంతే కాకుండా అనారోగ్య సమస్యలకు గురవుతారని చెబుతున్నారు.

ఈ రెమెడీస్‌ని పాటించడం ద్వారా నరదృష్టి నుంచి బయటపడొచ్చు..

కొంతమంది చెడు దృష్టి ప్రభావాన్ని త్వరగా తెలుసుకుని వెంటనే పరిష్కార మార్గాలను చూసుకుంటారు. మరి ఆ పరిష్కార మార్గాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం..

ఏదైనా దుష్టశక్తి వ్యాపారాల పై, కుటుంబాల పై పడితే నల్ల గుడ్డలో పటికను కట్టి తలుపుకు వేలాడదీయండి.

శనివారం రోజు రెండు నిమ్మకాయలు, ఏడు పచ్చి మిరపకాయలు కట్టి మీ షాపులో, ఆఫీసులో, షోరూంలో లేదా మరేదైనా వ్యాపార స్థలంలో వేలాడదీయండి.

నిమ్మకాయ, మిరపకాయలను ప్రతి ఒక్కరూ చూడగలిగే ప్రదేశంలో పెట్టాలని గుర్తుంచుకోండి.

ప్రతి శనివారం ఈ నిమ్మకాయ, మిరపకాయలు మారుస్తూ ఉండండి.

ఎండుమిర్చి, ఆవాలు 7 సార్లు వ్యాపార స్థలంలో తిప్పి వాటిని మంటలో వేసి కాల్చండి.

ఇలా చేయడం ద్వారా మీరు వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.

Tags:    

Similar News