శివుని మహిమలు.. ఆ ఆలయంలో పాలాభిషేకం చేస్తే మజ్జిగ వస్తుందట..!
అభిషేక ప్రియుడు శివుడు.. ఆ పరమశివునికి అభిషేకం చేసి మొక్కితే చాలు.. కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం.
దిశ, వెబ్‌డెస్క్: అభిషేక ప్రియుడు శివుడు.. ఆ పరమశివునికి అభిషేకం చేసి మొక్కితే చాలు.. కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఒక్క శివుని మాత్రమే కాదు.. ఏ దేవునికి అభిషేకం చేసినా వారికి కోరికలు తీరతాయట. ఎందుకంటే అభిషేకం సమయంలో దేవుని విగ్రహాలలో అద్భుత శక్తులు వెలువడతాయని, అలాంటప్పుడు కోరికలు తీరతాయని పండితులు చెబుతారు. ఇక ముఖ్యంగా శివుడికి అభిషేకం చేస్తే ఎన్నో శుభ ఫలితాలను పొందొచ్చు. అందుకే చాలా మంది భక్తులు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే శివయ్యకు అభిషేకం చేస్తారు. ఇక కోరికల మాట పక్కన పెడితే ఓ ఆలయంలో మాత్రం శివునికి సోమవారం పాలతో అభిషేకం చేస్తే మంగళవారం మజ్జిగ లభిస్తుందంట. అదేంటి అనుకుంటున్నారా.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదా.. మరి ఆ ఆలయం ఎక్కడుంది, మజ్జిగ ఎలా లభిస్తుంది వివరాలు తెలుసుకుందాం..
బెంగళూరులో ఉన్న ప్రసిద్ధ పరమేశ్వరుని ఆలయాల్లో గంగాధరేశ్వర దేవాలయం ఒకటి. ఈ శివాలయంలో కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ ఆలయంలోని శివునికి ప్రతి సోమవారం భక్తులు 500 లీటర్ల పాలను సమర్పిస్తారట. అప్పుడు ఆలయ సభ్యులు భక్తులకు ప్రసాదంగా మజ్జిగను అందజేస్తారట. శివునికి అభిషేకం చేసిన పాలన్నీ వృథా కాకుండా ఉండేందుకే ఆలయ కమిటీ ఈ నిర్ణయం తీసుకుందంట. ఆలయంలో ఇచ్చే మజ్జిగను భక్తులు అక్కడే తాగొచ్చు. లేదా ఇంటికి కూడా తీసుకెళ్లొచ్చట.
భోళా శంకరునికి వేటితో అభిషేకం చేయొచ్చు..
శివునికి తిరుమంజనపొడితో అభిషేకం చేస్తే గ్రహా దోషాల తొలగుతాయట. పసుపుతో అభిషేకిస్తే ప్రభుత్వ పనులకు ఆటంకం ఉండదట. బియ్యం పిండితో అయితే అప్పుల బాధలు తొలగిపోతాయట.
Read More: భారత్‌లో డయాబెటీస్‌పై భయంకర నిజాలు వెల్లడి