ఆ చెరువులో రహస్యం.. మహాదేవుని నామస్మరణతో నీటిలో బుడగలు..

ఉత్తరాఖండ్ పేరు వింటేనే గుర్తొచ్చేది అనేక దేవాలయాలు. అందుకే ఈ ప్రాంతాన్ని దేవతల భూమిగా భావిస్తారు.

Update: 2024-06-07 15:18 GMT

దిశ, ఫీచర్స్ : ఉత్తరాఖండ్ పేరు వింటేనే గుర్తొచ్చేది అనేక దేవాలయాలు. అందుకే ఈ ప్రాంతాన్ని దేవతల భూమిగా భావిస్తారు. భారతీయులు మాత్రమే కాకుండా విదేశీయులు కూడా వచ్చి దర్శించుకునే ప్రసిద్ధి చెందిన అనేక పురాతన, అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి. అలాగే ఈ ఆలయాలలో అనేక చెరువులు ఉన్నాయి. ఈ చెరువులలో ఎవరికీ అంతుచిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వీటిలో అద్భుతమైన దృశ్యాలు చూడవచ్చు. చార్ ధామ్‌లలో ఒకటైన కేదార్‌నాథ్ ధామ్‌కు కొంత దూరంలో ఇటువంటి అనేక చెరువులు ఉన్నాయి. ఈ చెరువులోని నీళ్లు శివుడి పేరు వింటే చాలు కదులుతుంది. ఇలాంటి అనేక ఆశ్చర్యకరమైన విశేషాలు మరెన్నో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అద్భుతాల చెరువు..

రేటాస్ కుండ్ కేదార్‌నాథ్ ఆలయానికి 500 మీటర్ల దూరంలో సరస్వతి నది ఒడ్డున ఉంది. పురాణాల ప్రకారం కామదేవుడిని శివుడు కోపంతో చంపేశాడు. అదిచూసిన కామదేవుని భార్య రతీదేవి దుఃఖంతో ఏడుస్తూ ఉండిపోయింది. ఆమె కన్నీళ్లతో ఏర్పడిందే ఈ చెరువు అని పురాణాలు చెబుతున్నాయి. అంతే కాదు ఈ ప్రదేశంలో పాండవులలో ఒకరైన భీముడు శివుడిని పూజించాడని, ఈ చెరువులోని పవిత్ర జలాన్ని సేవిస్తే శివుని దివ్య ఆశీర్వాదం లభిస్తుందని మరొక కథనం ప్రచారంలో ఉంది.

బుడగలు ఎప్పుడు వస్తాయి ?

చెరువుకు సంబంధించిన మరొక అద్భుతమైన విషయం ఏమిటంటే ఎవరైనా భక్తులు చెరువు దగ్గర శివ నామాన్ని జపించినప్పుడల్లా, లేదా ఓం నమఃశివాయ్ అని జపించినప్పుడల్లా చెరువులో నీటినుంచి బుడగలు వస్తుంటాయి. నీటి నుండి బుడగలు ఉద్భవించినప్పుడు భక్తుల కోరికలు కూడా నెరవేరుతాయని పురాణ విశ్వాసం. అలాగే ఈ పవిత్రజలాన్ని భక్తులు తాగితే శివుని దివ్య అనుగ్రహాన్ని పొందుతారని చెబుతారు.

2013లో..

2013 సంవత్సరంలో సంభవించిన విపత్తు కేదార్‌నాథ్ ధామ్ మ్యాప్‌ను మార్చింది. ఆ భయంకరమైన విపత్తు అనేక చెరువులను కూడా నాశనం చేసింది. వాటిలో ఒకటి రెటాస్ చెరువు. ఈ చెరువు అంతరించిపోయిన తర్వాత కూడా, చెరువు పట్ల భక్తులకు ఉన్న భక్తి, విశ్వాసం ఇప్పటికీ ప్రజలను అక్కడికి చేరుస్తుంది. భక్తులు ఇక్కడకు వచ్చి పూర్తి భక్తితో పూజలు చేస్తారు.


Similar News