నేటి నుంచి మూఢం.. పెళ్లికాని అబ్బాయిలు, అమ్మాయిలకు బ్యాడ్‌న్యూస్.. మూడు నెలలు ఆగాల్సిందే

నేటి నుంచి మూఢం..

Update: 2024-04-27 09:37 GMT

దిశ, ఫీచర్స్ : హిందూ జ్యోతిష్యం ప్రకారం, ఈ రోజు నుంచి మూఢం ప్రారంభమయ్యింది. గ్రహ యోగం దోషం ఉన్న సమయం ఇది. ఈ సమయం ప్రతికూలంగా పరిగణించబడుతుంది. దీంతో పెళ్లి వంటి శుభ కార్యక్రమాలు ఎవరూ పెట్టుకోరు. పెళ్లికానివారు మూఢం దాటేవరకూ ఆగాల్సిందే అంటున్నారు జ్యోతిష్య పండితులు.

హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల స్థితి, రాశుల కదలికను బట్టి అందరికీ కొంతకాలం మూఢంగా పరిగణిస్తారు. గురుగ్రహం సూర్యునికి సమీపంలో ఉన్నప్పుడు, శుక్రుడు సూర్యునికి సమీపంలో ఉన్నప్పుడు మూఢంగా పరిగణిస్తారు. ఈ కాలంలో పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు నిర్వహించరు. ఆశ్వయుజ మాసంలో శుభకార్యాలు చేయడం ప్రారంభిస్తారు. ఈసారి కూడా అదే విధంగా పుష్య మాసం మినహా మిగిలిన కాలంలో అనేక శుభకార్యాలు జరిగాయి.

పెళ్లి సమయంలో మార్కెట్‌లో అన్ని వస్తువుల రేట్లు ఎక్కువగా ఉంటాయి. వస్త్ర వ్యాపారం, బంగారు వ్యాపారం, హోటళ్లు, బ్రాహ్మణులకు గిరాకీ ఎక్కువ. కానీ ఇప్పుడు మూఢం మొదలయింది. వివాహాలు, ఇతర శుభకార్యాలు మరో మూడు నెలల పాటు ఏమి ఉండవు. ఈరోజు నుంచి ప్రారంభమయ్యి ఆగస్ట్ 8 వరకు ఉంటుంది. హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ మూడు నెలల్లో ఎలాంటి శుభాలు జరగవు.


Similar News