Arasavalli Sun Temple: అరసవల్లి దేవాలయ గర్భగుడి అసలు రహస్యం ఇదే !
అరసవల్లి సూర్య భగవానుడి పుణ్య క్షేత్రం ఏంతో విశిష్టమైనది.
దిశ, వెబ్ డెస్క్ : అరసవల్లి సూర్య భగవానుడి పుణ్య క్షేత్రం ఏంతో విశిష్టమైనది. ప్రత్యక్ష భాగవానుడైనా ఆదిత్యుడి నెలకొన్న పుణ్య క్షేత్రమిది. ఈ క్షేత్రం శ్రీకాకుళం పట్టణంలో ఉన్నది. ఈ ఆలయాన్ని కళింగ రాజు దేవేంద్ర వర్మ క్రీ.శ 673 సంవత్సరంలో నిర్మించారు. అయితే ఈ సూర్య భగవానుడు ఆలయానికి ప్రత్యేకమైన విశిష్టత ఉంది. ప్రతి ఏటా సంవత్సరంలో రెండు సార్లు మూడురోజుల్లో ఒకసారి గాలి గోపురాన్ని దాటి ధ్వజ స్తంబాన్ని తాకుతూ గర్భాలయంలో ఉండే మూల విరాట్ పై సూర్య కిరణాలు పడతాయి. ఇదే ఇక్కడ చెప్పుకోదగ్గ మహిమ. ఈ కిరణాలు ప్రతి సంవత్సరం మార్చి 9,10, 11 తేదీల్లో ఒకసారి.. అక్టోబర్ 1,2,3 తేదీల్లో మరొకసారి అరసవెల్లిలో సూర్య దేవుణ్ణి భానుడి కిరణాలు తాకుతాయి. ఉదయం 6 గంటలకు గాలి గోపురం మీదుగా వచ్చే సూర్య కిరణాలు ధ్వజ స్తంభాన్ని తాకుతూ మూల విరాట్ పై పడతాయి. అరుణ శిలతో చెక్కిన ఈ విగ్రహం సూర్య కిరణాలు పడగానే బంగారు ఛాయలో మెరుస్తాయి. ఇలా సూర్య కిరణాలు మూల విరాట్ ను తాకడం భగవంతుని లీలగా భావిస్తారు.