కుంభరాశి వారు పట్టిందల్లా బంగారమే...

జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. సూర్యుడు ప్రతి నెల రాశిని మారడాన్ని సంక్రాంతి అంటారు

Update: 2023-02-12 05:11 GMT

సూర్య గోచారంతో పలు రాశుల్లో మార్పులు

దిశ, వెబ్ డెస్క్:జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా భావిస్తారు. సూర్యుడు ప్రతి నెల రాశిని మారడాన్ని సంక్రాంతి అంటారు. రేపు అంటే ఫిబ్రవరి 13, ఉదయం 9.57 గంటలకు సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ పరిణామాన్ని కుంభ సంక్రాంతి అంటారు. సూర్యుని ప్రవేశం వల్ల ఈ రాశిలో మార్పు చాలా చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే శని దేవుడు ఇప్పటికే కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కుంభంలో శని మరియు సూర్యుని కలయిక ఉంటుంది. సూర్య భగవానుడు మార్చి 14 వరకు అదే రాశిలో ఉంటాడు. దీంతో నాలుగు రాశుల వారు లాభపడనున్నారు.

రాశు ఫలితాలు ఇలా..

    ముందుగా వృషభ రాశి వారికి సూర్య సంచారం చాలా శుభ ఫలితాలను ఇవ్వనుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారంలో భారీగా లాభాలు పొందుతారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు అమాంతం పెరుగుతాయి. కన్యారాశి వారికి సూర్య రాశిలో మార్పు వల్ల కలిగే శుభ ప్రభావం కన్యారాశి వారిపై ఉంటుంది. ఉద్యోగుల్లోల పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. శత్రువులపై అంతులేని విజయం సాధిస్తారు. ప్రజలు మీరు చేసిన పనులను మెచ్చుకుంటూ కీర్తిస్తారు. కుంభ రాశిలో సూర్యుడు సంక్రమించిన తర్వాతే కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ వ్యక్తుల వ్యక్తిత్వం వికసిస్తుంది. భాగస్వామ్య పనులు చేసే వ్యక్తులు కాస్త లాభపడతారు. ఉద్యోగులకు, వ్యాపారులకు సమయం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా ధనుస్సు రాశి వారికి సూర్యుని సంచారం శుభ ఫలితాలను ఇవ్వనుంది. ఈ రాశివారు కొత్త ఉద్యోగం లేదా వ్యాపారాలను మెుదలు పెడతారు. ధనం లాభ దాయకంగానూ ఉండనుంది. ప్రతిరోజూ సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వారు చేసే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. 

Tags:    

Similar News